టీటీడీ బోర్డు సభ్యుల నియామకం వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిల్‌

టీటీడీ బోర్డు సభ్యుల నియామకం వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిల్‌

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలకమండలి సభ్యుల నియామకాలను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. నేరచరిత్ర, లిక్కర్ వ్యాపారం చేస్తున్న వారిని టీటీడీ బోర్డు సభ్యులుగా నియమించడం సరికాదని చింతా వెంకటేశ్వర్లు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

టీటీడీ సభ్యులుగా ఎన్నికైన ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కేతన్ దేశాయ్, శరత్ చంద్రారెడ్డి నియమకాలను సవాల్ చేస్తూ.. ఈ ముగ్గురి టీటీడీ బోర్డు సభ్యత్వం తొలగించాలని పిటిషన్ లో కోరారు. ఈ అంశం కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.

ఏపీ ప్రభుత్వం ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులను నియమించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కోటాలో సామినేని ఉదయభాను, ప్రముఖ వ్యక్తుల కోటాలో కేతన్ దేశాయ్, శరత్ చంద్రారెడ్డిలను నియమించింది. అయితే ఈ సభ్యులను ఎంపికపట్ల తీవ్ర విమర్శలు వచ్చాయి. టీటీడీ సభ్యులుగా ఉండేందుకు వారు అనర్హులు అని.. టీటీడీ సభ్యులుగా వారి నియామకాలను సవాల్‌ చేస్తూ చింతా వెంకటేశ్వర్లు  హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.