గ్యాస్‌ నుంచి ఇథనాల్ తయారు చేసే ప్లాంట్

గ్యాస్‌ నుంచి ఇథనాల్ తయారు చేసే ప్లాంట్

దేశంలో తొలి ప్లాంట్ మహారాష్ట్రలో ఏర్పాటు చేయనున్న సెయిల్

న్యూఢిల్లీ: దేశంలో తొలిసారి గ్యాస్ నుంచి ఇథనాల్ తయారు చేసే ప్లాంట్‌‌‌‌ను సెయిల్ ఏర్పాటు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మహారాష్ట్రలో చంద్రాపూర్‌‌‌‌‌‌‌‌లో తన ఫెర్రో అలాయ్ ప్లాంట్‌‌‌‌లో గ్లాస్–టూ–ఇథనాల్ ప్లాంట్‌‌‌‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. క్రూడాయిల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్లాంట్ ఉండనుందని స్టీల్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ మిషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌టీఎంఐ) డైరెక్టర్ ముకేశ్ కుమార్ అన్నారు. ఈ ప్లాంట్ ద్వారా కర్బన్ ఎమిషన్స్‌‌‌‌ను తగ్గించవచ్చన్నారు. ఈ ప్లాంట్‌‌‌‌ను ఏర్పాటు చేసేందుకు ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌టీఎంఐ సెయిల్‌‌‌‌కు సాయం చేయనుంది.  ప్లాంట్‌‌‌‌ ఏర్పాటుకు సెయిల్‌‌‌‌కు సుమారు రూ.400 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. దీనిలో 20 శాతం వరకు బయోఫ్యూయల్స్ 2018 అనే నేషనల్ పాలసీ కింద ప్రభుత్వం అందించనుంది. స్టీల్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో ప్రపంచంలో ఇప్పటికే ఇలాంటి ప్లాంట్లు మూడు ఉన్నాయి. ప్రస్తుతం ఏర్పాటు చేయబోయేది నాలుగవది. ఇండియాలో అయితే ఇదే మొదటిది. ప్రస్తుతం బయో ఇథనాల్ ఫ్యూయల్ జనరేషన్ టెక్నాలజీని చైనాలో 2 ప్లాంట్లలో, బెల్జియంలో ఒక ప్లాంట్‌‌‌‌లో వాడుతున్నారు. ఈ కొత్త టెక్నాలజీతో.. ఫెర్రో అలాయ్ ప్లాంట్ నుంచి వచ్చే కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్‌‌‌‌లను తీసుకుని,  వాటిని ఫెర్మెంటేషన్ టెక్నాలజీ ద్వారా ఇథనాల్‌‌‌‌గా మార్చనున్నామని కుమార్ తెలిపారు. చంద్రాపూర్‌‌‌‌‌‌‌‌లో గంటకు ఉత్పత్తి చేసే 10 వేల నార్మల్‌‌‌‌ మీటర్ క్యూబ్ గ్యాస్‌‌‌‌ నుంచి రోజుకు 50 వేల లీటరు ఇథనాల్‌‌‌‌ను ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

గెస్ట్ లేకుండా రిపబ్లిక్ డే.. 55 ఏండ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే

6 రోజుల్లో 10 లక్షలు… ‘‘టీకా’’లో మనదే రికార్డు

ఉత్తరాఖండ్​కు.. ఒక్కరోజు సీఎంగా కాలేజీ అమ్మాయి

చదలవాడ హేమేశ్​కు బాల పురస్కార్