రూ.9వేల స్మార్ట్ఫోన్లో పవర్ బ్యాంక్ లాంటి బ్యాటరీ, పవర్ ఫుల్ ప్రాసెసర్

రూ.9వేల స్మార్ట్ఫోన్లో పవర్ బ్యాంక్ లాంటి బ్యాటరీ, పవర్ ఫుల్ ప్రాసెసర్

Moto G24 పవర్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది. ఇది కంపెనీ తాజా బడ్జెట్ స్మార్ట్ ఫోన్. Moto Gసిరీస్ లో ఈ కొత్త ఫోన్ Media Tech Helio G85 ప్రాసెసర్ తో నడుస్తుంది. ఇందులో 8GB RAMతో 128GB స్టోరేజ్ ఇవ్వబడింది. ఫోన్ 90Hz రిఫ్రెస్ రేట్ తో పంచ్ హోల్ డిస్ ప్లేను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ 6000 mAh. 

Moto G24 పవర్ 4GB+128GB స్టోరేజ్  వేరియంట్ ధర రూ. 8,999 మాత్రమే.  8GB+128GB వేరియంట్ ధర రూ. 9,999 గా నిర్ణయించారు. వివినయోగదారులు ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయొచ్చు. రిటైల్ షాపులు, Motorola వెబ్ సైట్ ని ద్వారా కూడా కొనుగోలు చేయొచ్చు. అమ్మకాలు ఫిబ్రవరి 7  మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అవుతాయి. 

లాంచ్ ఆఫర్ గా కస్టమర్లు తన పాత ఫోన్ ను ఎక్ఛేంజ్ చేసుకుంటే రూ. 750 ఎక్ఛేంజ్ బోనస్ కూడా పొందుతారేు. దీంతో ప్రారంభ ధర రూ. 8,249కే మీరు స్మార్ట్ ఫోన్ ను సొంత చేసుకోవచ్చు. కస్టమర్లు EMI ఎంపికను రూ. 317 ల నుంచి ఎంపిక చేసుకోవచ్చు. 

Moto G24 పవర్ స్పెసిఫికేషన్లు

  • డ్యుయెల్ సిమ్ (నానో) సపోర్ట్,ఆండ్రాయిడ్ 14 ఆధారిత My UX పై నడుస్తుంది  
  • 90Hz రిఫ్రెష్ రేట్, 537 nits  పీక్ బ్రైట్ నెస్
  • 6.56 అంగుళాల HD+IPS LCD డిస్ ప్లే 
  • 8GB LPDR4x RAM, ఆక్టాకోర్ Media Tech Helio G85 ప్రాసెసర్ 
  • RAM బూస్ట్ టెక్నాలజీ, 16GB వరకు ర్యామ్ ను పెంచుకోవచ్చు 
  • ఈ హ్యాండ్ సెట్ లో 3D యాక్రిలిక్ గ్లాస్ బిల్డ్ ఉంటుంది. 
  • ఫోటో గ్రఫీ కోసం Moto G24  బ్యాక్ సైడ్ డ్యుయెల్ కెమెరా సెటప్ 
  • 50MP ప్రైమరీ కెమెరా, 2MP మాక్రో కెమెరా కూడా ఉంటుంది. 
  • సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 
  • ఈ బడ్జెట్ ఫోన్ లో 128GB స్టోరేజ్ ఉంటుంది. దీనిని 1TB వరకు పెంచుకోవచ్చు. 

Moto G24 పవర్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైడ్ మౌంట్ చేయబడింది. దీని బ్యాటరీ 6000mAh , 33W Turbo Power  ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందించబడింది. డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో కూడి స్టీరియో స్పీకర్లు కూడా ఈ ఫోన్ లో ఉన్నాయి.