కంగేర్ ఘాటి నేషనల్ పార్క్లో నారింజ రంగు గబ్బిలం

కంగేర్ ఘాటి నేషనల్ పార్క్లో నారింజ రంగు గబ్బిలం

ఛత్తీస్‌గఢ్ బస్తర్ జిల్లాలోని కంగేర్ ఘాటి నేషనల్ పార్క్ లో అరుదైన నారింజ రంగు గబ్బిలం కనిపించింది. దీంతో పాటు అంతరించిపోతున్న దశలో ఉన్న భారతీయ తోడేలు కూడా కెమెరా కంటికి చిక్కింది. కంగేర్ ఘాటి నేషనల్ పార్క్ , ఇంద్రావతి టైగర్ రిజర్వ్‌లోని పలు ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటిలో ఆరేంజ్ బ్యాట్, ఇండియన్ ఊల్ఫ్ ఫోటోలు రికార్డయ్యాయి.

ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత బస్తర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో అంతరించిపోతున్న భారతీయ తోడేలు, అరుదైన జాతికి చెందిన 'ఆరెంజ్ బ్యాట్ కనిపించడంపై  కంగేర్ ఘాటి నేషనల్ పార్క్ డైరెక్టర్ గన్వీర్ ధర్మషీల్ సంతోషం వ్యక్తంచేశారు. దేశంలో భారతీయ తోడేళ్ల సంఖ్య చాలా తక్కువ సంఖ్యలో ఉన్నందున వన్యప్రాణి సంరక్షణ చట్టం (WPA), 1972లో షెడ్యూల్ I జాతిగా గుర్తించిందని చెప్పారు. అందుకే వాటి సంరక్షణకు అటవీ శాఖ చర్యలు తీసుకుంటుందని అన్నారు. తోడేళ్లు, నారింజ రంగు గబ్బిలాల సంరక్షణ కోసం ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు.