గతంలో ఎస్సైగా పనిచేసిన చోటే ఏసీపీగా

గతంలో ఎస్సైగా పనిచేసిన చోటే ఏసీపీగా

బెల్లంపల్లి, వెలుగు: గతంలో బెల్లంపల్లి టూ టౌన్ ఎస్​ఐగా పని చేసిన ఎ.రవికుమార్ ఇప్పుడు బెల్లంపల్లి ఏసీపీగా వచ్చారు. ఇక్కడ ఏసీపీగా పనిచేసిన పంతాటి సదయ్య బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో సిరిసిల్ల జిల్లాలో ఎస్ బీ డీఎస్పీగా పని చేసిన ఏ.రవికుమార్ ప్రమోషన్​ పొంది ఏసీపీగా బెల్లంపల్లికి బదిలీపై వచ్చారు. ఈ మేరకు బుధవారం ఏసీపీ ఆఫీస్​లో బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు, పోలీసుల సహకారంతో బెల్లంపల్లి డివిజన్​లో శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని విధాలా కృషి చేస్తానన్నారు. ప్రజలు తమకు ఏమైనా సమస్యలుంటే తనను నేరుగా సంప్రదించవచ్చన్నారు. నిత్యంఅందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తానని తెలిపారు.