పర్వతాల్లో పాప మిస్సింగ్.. 24 గంటల తర్వాత కాపాడిన్రు

పర్వతాల్లో పాప మిస్సింగ్.. 24 గంటల  తర్వాత కాపాడిన్రు
  • అమెరికాలో ఘటన

వాషింగ్టన్: అమెరికాలోని క్యాస్కేడ్ పర్వతాల్లో తప్పిపోయిన పదేండ్ల బాలికను 24 గంటల తర్వాత రెస్క్యూ టీమ్ కాపాడింది. ఎముకలు కొరికే చలిలో ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ చిన్నారి రాత్రంతా రెండు చెట్ల మధ్య పడుకున్నట్లు అధికారులు తెలిపారు. పదేండ్ల షుంగ్లా మశ్వా.. తన ఫ్యామిలీతో కలిసి క్లీ ఎల్మ్ వ్యాలీ చూసేందుకు వెళ్లింది. షుంగ్లా కుటుంబం లంచ్ చేసేందుకు ఒక చోట ఆగింది. మొత్తం 20 మందితో కూడిన బృందంలో షుంగ్లా మిస్సైనట్లు ఫ్యామిలీ మెంబర్స్ గుర్తించారు.

ఎంత వెతికినా షుంగ్లా ఆచూకీ దొరకలేదు. పోలీసుల సాయంతో 24 గంటల తర్వాత షుంగ్లా ఆచూకీ కనుగొన్నారు. ఆ టైంలో టెంపరేచర్ 3 డిగ్రీలకు పడిపోయింది. దీంతో ఆ చిన్నారి వెచ్చదనం కోసం రెండు చెట్ల మధ్య పడుకున్నట్లు గుర్తించారు. వెంటనే ఆ చిన్నారిని ట్రీట్​మెంట్ కోసం హాస్పిటల్​కు తరలించారు.