ఈ చైనా వాళ్లు తిననివి ఏమైనా ఉన్నాయంటారా..? ఆఖరికి దీనినీ వదల్లేదేంట్రా?

ఈ చైనా వాళ్లు తిననివి ఏమైనా ఉన్నాయంటారా..? ఆఖరికి దీనినీ వదల్లేదేంట్రా?

పాములు, కుక్కలు, పిల్లులు, పందులు, తేళ్లు, పాంగోలిన్ లు... ఇంకా ఏమైనా వన్య మృగాలుంటే మీరే ఊహించుకోండి. అయితే ఈ మృగాల లిస్టులో కొత్త దాన్ని కలుపుకోవాల్సిందే. అదే మొసలి. నిజమే మీరు విన్నది. అదేంటి వన్య మృగాల లిస్టులో అది ఇదివరకే ఉందిగా మళ్లీ కొత్తగా చేర్చడమేంటి అని డౌబ్ట్​ వచ్చిందా. అది వన్యమృగాల లిస్టులో కాదండీ.. చైనీయుల వంటకాల లిస్టులో. నిజం ఇప్పుడు మొసలి కూడా వాళ్ల ఫేవరేట్​ ఫుడ్​ కాబోతోంది. ఎలాగంటారా ఈ వార్త చదవితే మీకే తెలుస్తుంది.
తైవాన్​కు చెందిన విచ్​ క్యాట్​ అనే రెస్టారెంటోడికి మొసలి కనిపించగానే క్రేజీ ఐడియా వచ్చినట్టుంది. ఇంకేముంది వాళ్ల పైత్యానికి అడ్డు అదుపు ఉంటుందా. ఎప్పుడూ చికెన్​ లెగ్​పీస్ లే తినడం ఎందుకు మొసలి లెగ్​ పీస్​లు కస్టమర్లకు రుచి చూపిద్దాం అనుకున్నారట. మొసలిని చంపి దాని లెగ్​పీస్ తో ఇలాంటి సూప్ కం పీస్ వంట సిద్ధం చేశారు. దీన్ని తింటే చైనీయులకు రొమాంటిక్ గా ఉంటుందట.  ఇంకేముంది ఎవరు ఆ అనుభూతి పొందుతారు అంటూ ఎక్జిబీషన్ పెట్టారు. అయితే రెస్టారెంట్​కి వచ్చిన వాళ్లంతా దాన్ని చూసి ఫొటోలు తీసుకుంటూ, సోషల్​ మీడియాలో అప్​లోడ్​ చేస్తున్నారు. కానీ దీన్ని ట్రై చేయడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. ఇలాంటి అడ్డమైనవన్నీ తిని చైనా వాళ్లు ఇంకెన్ని పాడు రోగాలు అంటిస్తారో అని భయపడుతున్నారు పొరుగు దేశాల ప్రజలు.