యాదాద్రి, వెలుగు : రీజినల్రింగ్రోడ్డు (ట్రిపుల్ఆర్) అలైన్మెంట్ మార్పువిషయంలో మళ్లీ రివ్యూ చేస్తున్నామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం భువనగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం పట్టించుకోని కారణంగా అలైన్‌మెంట్‌పై త్రీడి గెజిట్కూడా వచ్చిందన్నారు. దీంతో అలైన్మెంట్మార్చకుండా ముందుకెళ్తే ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు.
అలైన్మెంట్ మార్పు కోసం సీఎం రేవంత్‌తో మాట్లాడామని, మరోసారి రివ్యూ చేద్దామని సీఎం చెప్పారన్నారు. రాయగిరి వద్ద స్పోర్ట్స్ స్టేడియం రాబోతున్నదని తెలిపారు. భువనగిరి కోటకు రోప్ వే ఏర్పాటు చేయడంతోపాటు సుందరీకరణ పనులు చేపడుతామని వెల్లడించారు. భూదాన్ పోచంపల్లి పట్టణాన్ని హెరిటేజ్ సిటీగా తీర్చిదిద్దుతామన్నారు. తుక్కుగూడలో నిర్వహించనున్న జన జాతర సభకు కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. రాబోయే పార్లమెంట్ఎన్నికల్లో కిరణ్‌కుమార్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.