
- బావి గట్టును ఆనుకొని ఆగిపోవడంతో తప్పిన పెను ప్రమాదం
- బస్సులో 45 మంది స్టూడెంట్లు..
- అద్దాలు పగలగొట్టి బయటకు తీసిన స్థానిక యువకులు
- సిద్దిపేట జిల్లా కోహెడ శివారులో ఘటన
కోహెడ, వెలుగు : సిద్దిపేట జిల్లా కోహెడ శివారులో ఓ స్కూల్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది. వ్యవసాయ బావి గట్టును ఆనుకొని ఆగిపోవడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. బెజ్జంకి మండలం రేగులపల్లిలోని సెయింట్విన్సెంట్పల్లోటి ప్రైవేట్స్కూల్కు చెందిన బస్సు సోమవారం మధ్యాహ్నం 45 మంది స్టూడెంట్స్‌ను తీసుకొని కోహెడకు బయలుదేరింది. కోహెడ శివారులోకి వచ్చే సరికి ఎదురుగా లారీ వస్తుండడం, దానికి సమాంతరంగా టువీలర్ దూసుకురావడంతో డ్రైవర్బస్సును పొలాల వైపు తిప్పాడు.
బస్సు స్పీడ్‌గా ఉండడంతో కంట్రోల్కాలేదు. పొలంలోకి దూసుకెళ్లి.. అక్కడ వ్యవసాయ బావి గట్టుకు ఆనుకుని ఆగిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. అటుగా వస్తున్న యువకులు రాజు, సతీశ్ పరుగున అక్కడికి చేరుకున్నారు. బస్సు మెయిన్డోర్వ్యవసాయ బావి వైపు ఉండడంతో మరోవైపు ఉన్న ఎమర్జెన్సీ డోర్‌ను పగలగొట్టడానికి వారు ప్రయత్నించారు. సాధ్యం కాకపోవడంతో రాడ్డుతో అద్దాలు పగలగొట్టి స్టూడెంట్స్‌ను బయటకు తీసుకువచ్చారు.