వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి త్రిమూర్తులుకు షాక్..18 నెలలు జైలు శిక్ష విధించిన కోర్టు

వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి త్రిమూర్తులుకు షాక్..18 నెలలు జైలు శిక్ష విధించిన కోర్టు

వైసీపీ ఎమ్మెల్సీ, ప్రస్తుత మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులకు గట్టి షాక్ తగిలింది.  27 ఏళ్ల నాటి శిరోముండనం కేసులో విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు జైలు శిక్ష విధించింది. 18 నెలల జైలు శిక్ష, రూ.1.50 లక్షల జరిమానా విధిస్తున్నట్టు కోర్టు తీర్పు ఇచ్చింది. 1996 డిసెంబర్ 26న వెంకటాయపాలెంలో శిరోముండనం ఘటన జరిగింది. 

అప్పట్లో ఎమ్మెల్యేగా తాను పోటీ చేసిన క్రమంలో తనకు వ్యతిరేకంగా వ్యవహరించారనే కారణంతో ఐదుగురు దళితుల్ని హింసించి, వీరిలో ఇద్దరికి శిరోముండనం చేయించిన ఆరోపణలు తోట త్రిమూర్తులుపై ఉన్నాయి. ఈ కేసు విచారణ సుదీర్ఘంగా కొనసాగింది. 1996 నుంచి దాదాపు 150 సార్లు విచారణలు జరిగాయి. ఈ కేసులో తోట త్రిమూర్తులుతో పాటు మరో 9 మంది నిందితులుగా ఉన్నారు. ఎట్టకేలకు విశాఖలోని ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల కేసుల ప్రత్యేక కోర్టు ఇవాళ శిక్ష ఖరారు చేసింది.