హెల్మెట్ లేకుండా బైకు నడిపిన చిరు వ్యాపారికి రూ.1.13 లక్షల జరిమానా

హెల్మెట్ లేకుండా బైకు నడిపిన చిరు వ్యాపారికి రూ.1.13 లక్షల జరిమానా

ఒడిశా: హెల్మెట్ లేకుండా బైకు నడిపిన చిరు వ్యాపారికి ఆర్టీయే అధికారులు ఏకంగా 1.13 లక్షల రూపాయల జరిమానా విధించారు. రాయగడ డీవీఐ జంక్షన్లో జరిగిన ఘటన సంచలనం సృష్టించింది.  అసలు బైకా లేక.. మినీ ఆటో ట్రాలీనా అనేరీతిలో బైకు మొత్తం ప్లాస్టిక్ డ్రమ్ములతో కప్పేసి తీసుకుని వెళ్తున్న ఈ చిరు వ్యాపారిని అధికారులు పట్టించుకునేవారు కాదు. కష్టజీవిలా కనిపించడంతో వదిలేద్దామనుకున్నారట. అయితే ఇంత కష్టపడుతున్న ఇతను హెల్మెట్ పెట్టుకోకపోవడంతో వెంటనే ఆపారు. మందలించేందుకు ఎవరో.. ఎక్కడివాడోనని తెలుసుకునేందుకు ఆపి ఆరా తీశారు. తన పేరు ప్రకాష్ బంజారా అని, తనది మధ్యప్రదేశ్ అని తెలిపాడు. వాహనం రిజిస్ట్రేషన్ వివరాల కాగితాలు వగైరా అడిగితే ఏమీ లేవన్నాడు. కనీసం హెల్మెట్ అయినా ఎందుకు పెట్టుకోలేదంటే నీళ్లు నమిలేశాడు. దీంతో అధికారులు సీరియస్ అయి.. ఇంత కష్టపడుతూ.. ప్రాణాలమీదకు తెచ్చుకుంటావా అంటూ మందలించారు. మళ్లీ ఇలాంటి తప్పు చేయకుండా ఏకంగా 1.13 లక్షల రూపాయల జరిమానా కట్టు అని చెప్పారు. అమ్మో అంత ఫైనా.. అంటూ కొద్దిసేపు బతిమాలి.. బేరమాడినట్లే కనిపించిన ప్రకాష్ బంజారా.. వెంటనే స్నేహితులకు చకచకా ఫోన్లు చేసి.. డబ్బులు తెప్పించుకుని ఫైన్ కట్టి వెళ్లిపోయాడు. కొందరు ఇతని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో కాసేపట్లోనే వైరల్ అయ్యాయి.

ఇవీ చదవండి..

జేఈఈ స్టూడెంట్ల కోసం అమెజాన్ అకాడమీ

పతంగులు ఎందుకు ఎగరేస్తరో తెలుసా?

జాక్‌మా కంపెనీలను జాతీయం చేసే యోచనలో చైనా

సంక్రాంతి వేడుకంతా రైతుదే