ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరిన ప్రత్యేక విమానం

ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరిన ప్రత్యేక విమానం

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల్ని రక్షించడానికి మోడీ ప్రభుత్వం... చర్యలు కొనసాగుతోంది. ఆపరేషన్ గంగా పేరుతో మోడీ సర్కార్... భారతీయుల్ని స్వదేశానికి తీసుకొస్తోంది. తాజాగా భారతీయులతో కూడిన ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరుకుంది. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విమానాశ్రయంలో వారికి స్వాగతం పలికారు. విద్యార్థులతో మాట్లాడారు. ఫ్లైట్‌లో ఉన్న విద్యార్థులతో మాట్లాడి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్వదేశానికి క్షేమంగా చేరుకున్న విద్యార్థులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిందన్నారు. అందుకే తాము వార్ జోన్ ప్రాంతం నుండి భారతీయ విద్యార్థులను ఖాళీ చేస్తున్నామన్నారు. ఉక్రెయిన్ నుండి భారతీయ విద్యార్థులందరినీ తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు కిషన్ రెడ్డి.

మరోవైపు ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది. ఖర్కివ్‌లోని భారత పౌరులంతా తక్షణం ఆ సిటీ నుంచి బయటపడాల్సిందిగా సూచించింది. భారత పౌరుల సేఫ్టీ, సెక్యూరిటీ దృష్ట్యా వారిని వేగంగా ఖర్కివ్ విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలని తెలిపింది. ఉక్రెయిన్ టైమ్ ప్రకారం ఆరు గంటల్లోపు (ఇండియన్ టైమ్ ప్రకారం రాత్రి 9.30 గంటలు) పెసోచిన్, బబాయే, బెజ్లియుడోవ్కాల్లో ఏదో ఒక ప్రాంతానికి చేరుకోవాలని కోరింది.

మరోవైపు ఇప్పటికే ఉక్రెయిన్‌లో ఇద్దరు భారతీయ విద్యార్థులు చనిపోయారు. ఒకరు అనారోగ్యంతో చనిపోగా.. మరో విద్యార్థి రష్యా చేసిన దాడుల్లో మృతి చెందాడు. ఈ ఘటనతో భారత ప్రభుత్వం మరింత అప్రమత్తం అయ్యింది. ఉక్రెయిన్ దేశంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులతో పాటు.. పౌరులను కూడా భారత్‌కు తీసుకొచ్చే చర్యల్ని మరింత వేగవంతం చేసింది.

ఇవి కూడా చదవండి:

తక్షణం ఖర్కివ్ నుంచి కదలండి: ఇండియన్స్‌కు సెకండ్ అడ్వైజరీ

ఆస్ట్రేలియా ప్ర‌ధానికి క‌రోనా పాజిటివ్