
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (ఎంసీసీ) మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎస్శాంతి కుమారి తెలిపారు. మోడల్ కోడ్ఆఫ్ కండక్ట్అమలు కోసం వచ్చే ప్రతిపాదనలను కమిటీ పరిశీలించనుందని వెల్లడించారు.
ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నదని చెప్పారు. ఈ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా, ఆయా ప్రతిపాదనలకు సంబంధించిన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సభ్యులుగా, జీఏడీ కార్యదర్శి సభ్యులుగా ఉంటారని వివరించారు.