స్టూడెంట్ ​లైన్​లో రాలేదని చితకబాదిన గురుకుల పీఈటీ

స్టూడెంట్ ​లైన్​లో రాలేదని చితకబాదిన గురుకుల పీఈటీ

ధర్మపురి, వెలుగు : జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం మగ్గిడిలోని ఎస్సీ గురుకులంలో లైన్​లో రావడం లేదని ఓ విద్యార్థిని పీఈటీ చితకబాదాడు. దీంతో అతడి చేతికి తీవ్ర గాయమైంది. తర్వాత స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో దవాఖానకు తరలించాల్సి వచ్చింది. ధర్మపురి మండలం బూరుగుపల్లికి చెందిన సాయి సందీప్​ గురుకులంలో  పదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం ఫేర్​వెల్​ పార్టీ  ఉండగా , 9,10  క్లాసుల స్టూడెంట్లను టీచర్లు బయటకు రమ్మని పిలిచారు. సాయి సందీప్​ లైన్​లో కాకుండా పక్క నుంచి వస్తుండడంతో పీఈటీ సురేశ్​ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇష్టం వచ్చినట్టు చితకబాదడంతో ఎడమ చేతికి గాయమైంది. కొద్దిసేపటికి సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో స్కూల్ ​సిబ్బంది విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పేరెంట్స్​ సాయి సందీప్​ను ధర్మపురి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం 108 వాహనంలో  జగిత్యాల ప్రభుత్వ దవాఖానకు తీసుకువెళ్లారు. విచక్షణారహితంగా కొట్టిన పీఈటీపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న జగిత్యాల కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాస్పిటల్​కు వెళ్లి స్టూడెంట్ ను పరామర్శించారు.