
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో ఘటన
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ టీచర్ ఐదో తరగతి స్టూడెంట్ను స్కూల్ బిల్డింగ్ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి విసిరేసింది. వెంటనే గమనించిన స్థానికులు ఆమెను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆ స్టూడెంట్ కోలుకుంటోంది. సెంట్రల్ ఢిల్లీలోని మోడల్ బస్తీలో గల ప్రాత్మిక్ విద్యాలయంలో గీతా దేశ్వాల్అనే టీచర్ఈ దారుణానికి పాల్పడింది. టీచర్ ముందుగా ఆ స్టూడెంట్‌పై కత్తెరతో దాడిచేసింది.
అనంతరం ఆమెను ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి విసిరేసింది. దీంతో స్టూడెంట్‌కు గాయాలయ్యాయి. బిల్డింగ్‌పైనుంచి కింద పడిన స్టూడెంట్ను చూసి పెద్ద సంఖ్యలో జనం గుమికూడారు. వెంటనే ఆ స్టూడెంట్ను సమీపంలోని హిందూరావు హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని అధికారులు తెలిపారు. అన్నిరకాల మెడికల్ టెస్టులు నిర్వహించి, అవసరమైన ట్రీట్మెంట్ అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు.
టీచర్ సస్పెన్షన్
విషయం తెలిసి స్కూల్‌కు వచ్చిన పోలీసులు.. టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్ ఆధారంగా టీచర్‌పై అటెంప్ట్ మర్డర్ కేసు ఫైల్చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డిప్యూటీ పోలీస్ కమిషనర్ తెలిపారు. స్టూడెంట్ను స్కూల్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి విసిరేసిన టీచర్ గీతా దేశ్వాల్ను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సస్పెండ్ చేశారు.