
- 600 కేంద్రాల్లో స్వీకరించిన బల్దియా అధికారులు
- కొత్త రేషన్ కార్డుల కోసమే ఎక్కువగా దరఖాస్తులు
హైదరాబాద్,వెలుగు : గ్రేటర్ సిటీలో ప్రజా పాలన కార్యక్రమానికి మొత్తంగా 24,74,325 అప్లికేషన్లు వచ్చాయి. ఆఖరురోజు శనివారం 2 లక్షలు అందాయి. ప్రజా సమస్యల పరిష్కారం, ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వం నిర్వహించిన ప్రజా పాలన ముగిసింది. గ్రేటర్‌పరిధిలోని 600 కేంద్రాల్లో ప్రజల నుంచి బల్దియా అధికారులు దరఖాస్తులు స్వీకరించారు.
కార్యక్రమం కొనసాగిన 8 రోజుల్లో మొత్తం 26,48,521 కుటుంబాల నుంచి అభయ హస్తం కింద 19,01,256 , రేషన్‌కార్డులు, ఇతర సమస్యలపై 5,73,069 అప్లికేషన్లు వచ్చాయి. ప్రజల నుంచి ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చిందని బల్దియా అధికారులు తెలిపారు. కార్యక్రమం ప్రారంభం రోజున కొద్దిగా సమస్యలు ఎదురైనా ఆ తర్వాత సరిదిద్దుకుని సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించామని పేర్కొన్నారు. డిసెంబరు 28 నుంచి ఈనెల 6వ తేదీ శనివారం వరకు మధ్యలో రెండు రోజులు మినహా 8 రోజులు ప్రజా పాలన కార్యక్రమం కొనసాగింది.
హైదరాబాద్‌లో రైతుబంధు మినహా మిగిలిన ఐదు గ్యారంటీలైన మహిళలకు రూ. 2500 సాయం, రూ.500 గ్యాస్‌సిలిండర్, గృహజ్యోతి, చేయూత పెన్షన్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటివాటితో పాటు రేషన్‌కార్డులకు ప్రత్యేకంగా మరో దరఖాస్తు తీసుకున్నారు. అన్ని కేంద్రాల్లోనూ దరఖాస్తు ఫారాలను అధికారులు అందుబాటులో ఉంచడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా దరఖాస్తులను స్వీకరించారు. ఐదు గ్యారంటీలతో పాటు రేషన్ కార్డులకే అత్యధికంగా దరఖాస్తులు వచ్చినట్టు బల్దియా అధికారులు వివరించారు.
రంగారెడ్డి జిల్లాలో 5.53 లక్షలు
ఎల్బీనగర్ : రంగారెడ్డి జిల్లాలో ప్రజా పాలన కింద ఎనిమిది రోజుల్లో మొత్తం 5,53,277 దరఖాస్తులు అందాయి. 558 పంచాయతీల్లో 2,46,626 కుటుంబాల నుంచి 2,91,470 అప్లికేషన్లను అధికారులు స్వీకరించారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో మొత్తం 363 వార్డులు నుంచి 2,61,807 దరఖాస్తులను వచ్చినట్టు అధికారులు తెలిపారు.
బల్దియా పరిధిలో జోన్ల వారీగా వచ్చిన దరఖాస్తుల వివరాలు
జోన్ మొత్తం కుటుంబాలు అభయహస్తం రేషన్, ఇతర దరఖాస్తులు మొత్తం
ఎల్బీనగర్ 4,12,382 2,35,278 81,641 3,16,919
చార్మినార్ 5,93,895 5,12,988 1,40,807 6,53,795
ఖైరతాబాద్ 4,21,291 3,29,638 98,267 4,27,950
కూకట్పల్లి 4,19,115 3,17,599 87,147 4,04,746
శేరిలింగంపల్లి 2,81,513 1,64,526 64,829 2,29,355
సికింద్రాబాద్ 4,61,031 2,98,156 93,004 3,91,160
కంటోన్మెంట్ 59,294 43,026 7,374 50,400
మొత్తం 26,48,521 19,01,256 5,73,069 24,74,325