నిద్రపోయిన వ్యక్తిపై నుంచి పోయిన ట్రాక్టర్ ట్రాలీ.. నల్గొండ జిల్లాలోని బొక్కముంతలపాడులో ఘటన

నిద్రపోయిన వ్యక్తిపై నుంచి పోయిన ట్రాక్టర్ ట్రాలీ.. నల్గొండ జిల్లాలోని బొక్కముంతలపాడులో ఘటన
  •     స్పాట్ లో వరికోత మెషీన్ యజమాని మృతి

హాలియా, వెలుగు : నిద్రపోయిన వ్యక్తిపై నుంచి ట్రాక్టర్ ట్రాలీని ముందుకు నడిపించడంతో ఒకరు  మృతి చెందిన ఘటన నల్గొం డ జిల్లాలో జరిగింది. నిడమనూరు ఎస్ఐ సురేశ్​తెలిపిన ప్రకారం.. మండలంలోని బొక్కముంతలపాడు శివారులో రైతు జిల్లేపల్లి సైదయ్య మంగళవారం అర్ధరాత్రి తన వరిపొలాన్ని మెషీన్ తో కోయిస్తున్నాడు. 

అదే సమయంలో తమిళనాడుకు చెందిన వరి కోత మెషీన్ యజమాని ఉనబెళగన్ దక్షిణామూర్తి ట్రాక్టర్ ట్రాలీ కింద నిద్రపోయాడు. ట్రాక్టర్ డ్రైవర్ పసుపులేటి నాగేశ్వరరావు చూడకుండా ముందుకు నడిపించాడు.  దీంతో దక్షిణామూర్తిపై నుంచి టైర్లు వెళ్లడంతో తల పగిలి స్పాట్ లో చనిపోయాడు. డెడ్ బాడీని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి అన్న రంగనాథ్​ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.