మసూద్‌ అజర్‌పై ట్రావెల్‌ బ్యాన్‌ విధించాలి: అమెరికా

మసూద్‌ అజర్‌పై ట్రావెల్‌ బ్యాన్‌ విధించాలి: అమెరికా

ఇటివల జరిగిన పుల్వామా దాడిలో తమ పాత్ర ఉందన్ని జైషే అంగీకరించింది. ఈ క్రమంలో జైషే మ‌హ్మ‌ద్ చీఫ్ మ‌సూద్ అజ‌ర్‌ను అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా ప్ర‌క‌టించేందుకు అమెరికా మ‌ళ్లీ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తా మండ‌లిలో చైనాపై ఒత్తిడి తెచ్చేందుకు మ‌రోసారి సరికొత్త తీర్మానాన్ని తయారు చేసింది. రెండు వారాల క్రిత‌మే అమెరికా ప్ర‌తిపాద‌న‌ను త‌న వీటో అధికారంతో చైనా అడ్డుకుంది. అయితే తాజాగా మ‌ళ్లీ బ్రిట‌న్‌, ఫ్రాన్స్ దేశాల స‌హ‌కారంతో అమెరికా.. ఐక్య‌రాజ్య‌స‌మితిలో అజ‌ర్ నిషేధంపై ఒత్తిడి తెస్తున్న‌ది. భ‌ద్ర‌తా మండ‌లిలో ఉన్న 15 స‌భ్య‌దేశాల‌కు బ్రిట‌న్‌, ఫ్రాన్స్ సంత‌కం చేసిన తీర్మానాన్ని అమెరికా స‌ర్క్యూలేట్ చేసింది. అజ‌ర్‌పై ట్రావెల్ బ్యాన్ విధించాల‌ని, అత‌ని ఆస్తుల‌ను స్తంభింప‌చేయాల‌ని కోరింది.