భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్, వెలుగు : రాష్ట్రంతో పాటు దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలని ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్లు అనుదీప్ దూరిశెట్టి, జితేశ్వి పాటిల్ అన్నారు. మంగళవారం మౌలానా అబుల్‌కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయా కలెక్టరేట్లో ఆయన ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తరువాత నెహ్రూ నాయకత్వంలోని తొలి క్యాబినెట్ లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారని, ఆయన పుట్టినరోజు సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవంగా వేడుకలు నిర్వహిస్తున్నామని వివరించారు.
మౌలానా ఆజాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నారు. దేశంలో విద్యాభివృద్ధికి పునాధులు వేసిన మహానీయుడు ఆజాద్ అని కొనియాడారు. ఖమ్మంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శ్రీజ, కొత్తగూడెంలో అడిషనల్ కలెక్టర్ డి. వేణుగోపాల్, జిల్లా మైనార్టీ ఆఫీసర్సంజీవరావు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
