పార్లమెంట్‌కు బడ్జెట్ పేపర్ల ట్రక్‌.. బాంబ్‌ స్క్వాడ్ తనిఖీలు

పార్లమెంట్‌కు బడ్జెట్ పేపర్ల ట్రక్‌.. బాంబ్‌ స్క్వాడ్ తనిఖీలు

కేంద్ర బడ్జెట్ 2022ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెడతారు.ఇవాళ సభలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ కాపీల బండిల్స్‌ను పార్లమెంట్‌ వద్దకు ఒక ట్రక్కులో చేర్చారు అధికారులు. ఈ ట్రక్కులోని బడ్జెట్ పేపర్లను కిందకు దించిన తర్వాత సెక్యూరిటీ ఆఫీసర్లు, బాంబు స్క్వాడ్ తనిఖీలు చేశారు.

కాగా, గడిచిన రెండేళ్లుగా కరోనా వైరస్ ప్రభావంతో దేశ ఆర్థిక పరిస్థితి గడ్డుకాలంలో  కొట్టుమిట్టాడుతోంది. అయినా దేశాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని, అన్ని రంగాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం భారీ బడ్జెట్‎ను ప్రవేశపెడుతోంది. నిరుడు రైతులు, వలస కార్మికులను ఆదుకోవడంతో పాటు పారిశ్రామిక రంగాన్ని గాడినపెట్టడం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌కు, వైద్య సదుపాయాలను మెరుపరిచేందుకు బడ్టెట్‌లో పెద్ద పీట వేశారు ఆర్థిక మంత్రి నిర్మలమ్మ. ఈసారి కూడా అన్ని రంగ అవసరాలకు అనుగుణంగా సమ్మిళిత బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్ అందరికీ ప్రయోజనం చేకూరుస్తుందన్నారు ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి. రైతుల నుంచి అన్ని రంగాలు వారు బడ్జెట్ మీద అంచనాలను కలిగి ఉన్నారన్నారు.