22లక్షలతో ఉడాయించిన బ్యాంక్ క్యాషియర్ కేసులో ట్విస్ట్

 22లక్షలతో ఉడాయించిన బ్యాంక్ క్యాషియర్ కేసులో ట్విస్ట్

హైదరాబాద్: వనస్థలిపురం సాహెబ్ నగర్ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులో 22 లక్షల నగదును.. అందులో పనిచేస్తున్న క్యాషియర్ ప్రవీణ్ కుమార్ చోరీ కేసులో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ చోరీ కేసుపై ఫిర్యాదు వచ్చిన వెంటనే దర్యాప్తును ముమ్మరం చేశారు. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించంతోపాటు.. నగదు ఎత్తుకెళ్లిన క్యాషియర్ కోసం నిఘా పెట్టారు. మూడు టీములతో గాలింపు చేపట్టారు. 
క్రికెట్ బెట్టింగులో నష్టపోయి.. చోరీ
బ్యాంక్ ఆఫ్ బరోడాలో క్యాషియర్ ప్రవీణ్ కుమార్ చోరీకి ప్రధాన కారణం క్రికెట్ బెట్టింగ్ వ్యవహారమేనని గుర్తించిన పోలీసులు పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇంతలో ఇవాళ ఉదయం బ్యాంకు మేనేజర్ కి ప్రవీణ్ కుమార్ నుంచి మేసేజ్ వచ్చింది. క్రికెట్ బెట్టింగ్ లో ఆర్థికంగా నష్టపోయి చోరీ చేశానని బ్యాంక్ మేనేజర్ కు ఉదయం మెస్సేజ్ చేసిన ప్రవీణ్ .. ఇప్పుడు చోరీ చేసిన డబ్బులు కూడా బెట్టింగ్ లో పెడుతున్నానని.. గెలిస్తే డబ్బులు వస్తే తిరిగి ఇస్తాను.. లేదంటే సూసైడ్ చేసుకుంటానని సమాచారం ఇచ్చాడు. దీంతో అలర్టయిన పోలీసులు ప్రవీణ్ కుమార్ ఎక్కడున్నాడనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బ్యాంకు మేనేజర్, బ్యాంక్ సిబ్బందికి పంపిన మెసేజ్ ల ఆధారంగా ప్రవీణ్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకునే పనిలో పడ్డ పోలీసులు.. బ్యాంక్ లోపల, బయట ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ప్రవీణ్ కుమార్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక టీమ్ లు.. చోరీని ఒక్కడే చేశాడా.. లేక బ్యాంక్ సిబ్బంది, ప్రవీణ్ స్నేహితుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

రివ్యూ: సర్కారు వారి పాట

మాజీ పంచాయితీ అధికారి ఇంట్లో భారీగా ఆస్తుల గుర్తింపు

వీడియో: కదులుతున్న రైల్లో నుంచి పడబోతుంటే..