భారీ వర్షాలకు వంతెన కూలింది.. అధికారులు.. ప్రజలు పట్టించుకోలేదు.. విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. ఆగ్రామంలోని ప్రజలకు చిన్న వస్తువు కావాలన్నా... దాదాపు రూ. 160 లు ఖర్చు పెట్టుకుని చుట్టూ తిరిగి వెళ్లాలి. ఇక ఆగ్రామ ప్రజలు తమను ఎవరు.. ఏ ప్రభుత్వం పట్టించుకోదు అనుకున్నారో ఏమో తెలియదు కాని.. చందాలు పోగు చేసి 26.5 మీటర్ల పొడవు, ఒక మీటరు వెడల్పు గల ఇనుప వంతెన నిర్మించుకొని ఔరా అనిపించుకొని దేశానికి ఆదర్శంగా నిలిచాయి ఆగ్రామాలు.. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే
కేరళలోని కొట్టాయం.. ఇడుక్కి సరిహద్దుల్లో కొక్కయార్ అనే గ్రామంలో పుల్లుకాయార్ నదిపై ఈ వంతెనను ఆర్చ్ ఆకారంలో ఇనుప వంతెనను స్థానికులు నిర్మించారు. ఇప్పుడు ఈవంతెన ఇడుక్కి జిల్లాలో నాలుగు గ్రామాల విద్యార్థుల చదువుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎంతయార్ తూర్పు, వడక్కెమల, కనకాపురం, ముక్కుళం గ్రామాల వాసులకు ఎలమ్‌కాడు మార్గంలో 5 కిలోమీటర్లు మళ్లి ఎంథాయార్ చేరుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈవంతెన 2021 భారీ వర్షాలకు కూలిపోవడంతో ఎంథాయార్ వెళ్లాలంటే చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వంతెన నిర్మాణానికి పూనుకున్న కేఈ నజీబ్ ను గ్రామస్థులు ప్రశంసించారు.
కేఈ నజీబ్ వెల్డింగ్ వర్క్‌షాప్ నడుపుతూ.. బిల్డింగ్ కాంట్రాక్టర గా పనిచేస్తున్నాడు. విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారనే ఆవేదనతో.. స్థానికుల నుంచి వంతెన నిర్మాణానికి నిధులు సేకరించారు. నజీబ్... కొక్కయార్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు పీవీ విశ్వనాథన్, అధ్యక్‌షుబు మోలి డొమెనిక్ ఆధ్వర్యంలో రూ. 1.25 లక్షలు విరాళాలు సేకరించి.. ఇనుప వంతెన నిర్మించారు. కూట్టికల్ గ్రామపంచాయతీ అధ్యక్షుడు బినోయ్ జోస్, వార్డు మెంబర్ మాయా జయేష్, ఎంథాయార్ వ్యాపారులు తదితరులు ఆర్థిక సహాయం అందించారు.
2021 లో కురిసిన భారీ వర్షాలకు పుల్లుకాయార్ నది ఉప్పొంగి ఇడుక్కి.. కొట్టాయం జిల్లాలను కలిపే ఎంథయార్ ముక్కుళం వంతెన కొట్టుకుపోయింది. ఆసమయంలో మళ్లీ వంతెన నిర్మించేదుకు రూ. 25 లక్షలు అంచనా వేశారు. అంత డబ్బు ఆ చిన్న పంచాయతీ భరించలేకపోవడం.. ప్రభుత్వాలు పట్టించుకోక పోవడంతో మళ్లీ వంతెన నిర్మాణం జరగలేదు. అయితే ఆ సమయంలో వెల్డింగ్ వ్యాపారి నజీబ్ ను సంప్రదించగా కూలిపోయిన వంతెన మధ్య భాగాన్ని ఇనుప ఫ్రేమ్ లతో నిర్మించారు.
అయితే ఏప్రిల్ 2023 లో ఉన్న ఈ వంతెనను కూల్చి.. కొత్త వంతెనను నిర్మించేందుకు ప్రభుత్వంశ్రీకారం చుట్టింది. సహజంగా ప్రభుత్వ పనులంటే నత్తనడకే కదా.. అలాగే ఈ వంతెన పనులు కూడా ఆలస్యంగా జరుగుతున్నాయి. ఎండాకాలంలో పెద్దగా నీరుండదు .. నది ఎండిపోతుంది కాబట్టి రాకపోకలకు పెద్దగా ఇబ్బంది ఉండదు. వర్షాకాలం ప్రారంభం కావడం.. పాఠశాలలు ఓపెన్ అయ్యే సమయం దగ్గర పడడంతో.. నదిలో నీటి మట్టం పెరిగి రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ గ్రామాల ప్రజలు సిటీకి వెళ్లాలంటే 7 కిలోమీటర్లు చుట్టూ తిరిగి.. అదనంగా రూ. 160 లు ఖర్చు చేసి వెళ్లాలి.దీంతో స్థానికులు చక్క వంతెన ఏర్పాటు చేసుకుందామని ముందు భావించారు. అయితే అది సాధ్యపడకపోవడంతో జూన్ 3 న పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఈలోపుగానే నజీబ్ ఇనుప వంతెన నిర్మించారు.
కొక్కయార్ , కూట్టిక్కల్ వంటి పంచాయతీలు,స్థానికుల సహకారంతో మే 23న వంతెన పనులు ప్రారంభమయ్యాయి. పాఠశాల పునఃప్రారంభం కాకముందే నజీబ్ పని పూర్తి చేశారు. 26.5 మీటర్ల పొడవు, ఒక మీటరు వెడల్పుతో వంతెన పనులను నలుగురు సహాయకులతో 9 రోజుల్లో పూర్తి చేశాడు. 24 గంటలు షిఫ్ట్‌ల వారీగా పనులు చేస్తూ ఆర్చ్ వంతెనను 2.5 టన్నుల GI పైపులతో తయారు చేశారు. వంతెనకు సంబంధించిన వెల్డింగ్ పనులు ఒడ్డునే జరిగాయి. ఆ తరువా క్రేన్ తో వంతెనను కాంక్రీట్ తో చేసిన బెడ్ పై అమర్చారు.
