అర్హులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి : వరుణ్​ రెడ్డి

 అర్హులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి : వరుణ్​ రెడ్డి

నిర్మల్​, వెలుగు : అర్హులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నిర్మల్​ కలెక్టర్​ వరుణ్​ రెడ్డి సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ఓటు వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 

ప్రజాస్వామ్య దేశంలో ఓటు వజ్రాయుధం అన్నారు. 18 ఏళ్లు నిండిన యువత ఓటు హక్కు కలిగి ఉండాలని సూచించారు. అంతకు ముందు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సాంస్కృతిక కళాకారులతో ప్రత్యేక పాటను రూపొందించారు.  కార్యక్రమంలో డీపీఆర్వో తిరుమల, అధికారులు పాల్గొన్నారు.