చిరుత పులి కాదు.. అడవి పిల్లి

చిరుత పులి కాదు.. అడవి పిల్లి

జీడిమెట్ల, వెలుగు: గాజులరామారం సర్కిల్​పరిధిలో బుధవారం ఓ అడవి పిల్లి స్థానికులను భయపెట్టింది. కైసర్​నగర్ డబుల్ బెడ్​రూమ్​ఇండ్ల సముదాయంలో తిరుగుతూ, అక్కడి సంపులో పడింది. పిల్లి ఒంటిపై అచ్చం చిరుత పులిలా మచ్చలు ఉండడంతో అంతా టెన్షన్​పడ్డారు. కొందరు యువకులు ధైర్యం చేసి, దాన్ని పట్టుకున్నారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి అది అడవి పిల్లి అని తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బౌరంపేటకు చెందిన రాకేశ్ అనే వ్యక్తి జంతువుల ఫామ్​నిర్వహిస్తున్నాడని, 15 రోజల కింద అందులోని అడవి పిల్లి తప్పించుకుందని చెప్పారు. అప్పటి నుంచి దీని కోసం వెతుకుతున్నామని తెలిపారు.