డాక్టర్ల నిర్వాకం.. పొట్టలో కర్చీఫ్, కాటన్ గుడ్డను మరిచిపోయి కుట్లు

డాక్టర్ల నిర్వాకం.. పొట్టలో కర్చీఫ్, కాటన్ గుడ్డను మరిచిపోయి కుట్లు

జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది.  డాక్టర్ల నిర్వాకం వలన ఓ మహిళ గత 16 నెలలుగా నరకం చూసింది. ఈ సంఘటన జగిత్యాల జిల్లా ఏరియా ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఇక వివారాల్లోకి వెళ్తే..  రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన నవ్య శ్రీ అనే బాలింత తన తల్లిగారి ఇల్లు జగిత్యాల కావడంతో ఏరియా ఆస్పత్రిలో గతేడాది డిసెంబర్ లో ఆసుపత్రిలో చేరింది. అయితే అక్కడ ఆమెకు సిజేరియన్ చేసిన వైద్యులు పొట్టలో కర్చీఫ్, కాటన్ గుడ్డను మరిచిపోయి కుట్లు వేశారు.  దీంతో అప్పటినుంచి అంటే గత 16 నెలలుగా నవ్య శ్రీ  కడుపునొప్పితో  బాధపడుతూ వచ్చింది.


సంవత్సరాలు గడుస్తున్న కొద్ది సమస్య తగ్గకపోగా బాధ ఇంకాఎక్కువ కావడంతో భరించలేని స్థితిలో వేములవాడ పెద్ద ఆసుపత్రిలో చేరింది. అక్కడ స్కానింగ్​ చేసి చూస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ స్కానింగ్ లో నవ్య శ్రీ  పొట్టలో కర్చీఫ్, కాటన్ గుడ్డలు ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు.  ఈ విషయం తెలియడంతో నవ్య శ్రీ కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. వెంటనే ఆపరేషన్ చేసిన డాక్టర్లను అడుగుదామని  ఏరియా ఆసుపత్రికి  వెళ్లగా అక్కడ డాక్టర్లు అక్కడ లేకపోవడంతో కుటుంబ సభ్యులు వెనుదిరిగారు. 

అనంతరం ఇదే విషయంపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కాగా ఇప్పటికే జగిత్యాల మాత శిశు, ఏరియా ఆసుపత్రుల్లో డాక్టర్ల నిర్లక్ష్యంతో ఆరుగురు గర్భిణీ స్త్రీలు,చిన్నారులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.  ప్రతిపక్షాలు, మరణించిన వారి కుటుంబ సభ్యులు ఎన్ని ధర్నాలు చేసిన అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికి వారిపైల ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.