
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం ఎల్ కొట్టలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్యా యత్నం చేసుకుంది. ఈ ఘటనలో తల్లి సుభాషిణి మరణించగా.. కూతుళ్లు మన్యశ్రీ.. విలక్షణ ఆస్పత్రిలో చికిత్స పొందుతన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే...
కర్నూలు జిల్లా ఎల్ కొట్టాలలో సుభాషిణి తన ఇద్దరు కూతుళ్లతో నివసిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ తల్లి తన చిన్నారులతో కలిసి జీవితాన్ని ముగించింది. కుటుంబ ఖర్చుల కోసం అప్పులు చేస్తూ జీవనం కొనసాగించింది. ఆర్థిక సంక్షోభం మనోవేదనకు గురిచేయడంతో తల్లి సుభాషిణి తన ఇద్దరు కుమార్తెలకు విషం ఇచ్చి.. తరువాత తాను కూడా పాయిజన్ తీసుకుంది. దీనిని గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే తల్లి సుభాషిణి మృతి చెందగా.. ఇద్దరు కుమార్తెలు చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం అందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ధరలు.. చాలీ చాలని ఆదాయం.. అప్పుల భారం పెరగడం.. తీర్చే స్థోమత లేక బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో బాధ పడేవారు మానసికంగా బలంగా లేకపోతే ఇలానే జీవితం ముగించాల్సి వస్తుంది. ఫైనాన్స్ ప్లోబ్లమ్స్ ఉన్న వారిని సమాజం చైతన్య పర్చే విధంగా కార్యక్రమాలు రూపొందించాలి. మానసికంగా కుంగి పోయిన కుటుంబాలకు చేయూత నివ్వాలి.
ఆర్థిక ఇబ్బందులు వ్యక్తిగత జీవితం మీద ఎంతటి ప్రభావం చూపగలవో ఈ ఘటన మరోసారి అర్థమౌతుంది. సుభాషిణి తన పిల్లలకు ఇచ్చి విషం ఇచ్చి .. తాను మరణించడం తప్పు అనే దాని కంటే .. ఇలాంటి పరిస్థితులు ఎందుకు దాపురిస్తున్నాయో ప్రభుత్వాలె ఆలోచించాలి. . ఆమెను ఆ స్థితికి నెట్టి వేసిన పరిస్థితులపై సమాజం ప్రశ్నించాలి. ఏది ఏమైనా ప్రతి సమస్యకు చావే పరిష్కారం కాదు కదా..!