
గాయపడ్డ పులితో చాలా ప్రమాదమన్నారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. తృణమూల్ ఎన్నికైతేనే బెంగాల్ లో ప్రజాస్వామ్యం ఉంటుందన్నారు మమత. బెంగాల్ కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలన్నింటిని భగ్నం చేస్తామన్నారు. వీల్ చెయిర్ లోనే ప్రచారం చేస్తానని మమత చెప్పారు. కోల్ కతాలో వీల్ చెయిర్ లోనే... ప్రచార యాత్ర చేసిన మమత... తానెవరికీ తలవంచబోనని స్పష్టం చేశారు.