రుద్రూర్ మండలంలో సెల్ టవర్ ఎక్కి యువకుడి హల్ చల్

రుద్రూర్ మండలంలో సెల్ టవర్ ఎక్కి యువకుడి హల్ చల్

వర్ని, వెలుగు : రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన చాకలి రాజు సోమవారం సాయంత్రం సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, ఎస్సై సాయన్న తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని యువకుడిని సముదాయించడంతో సెల్ టవర్ నుంచి కిందకు దిగాడు. 

పోలీసులు విచారించగా, భార్య కాపురానికి రావడం లేదని, అందుకే సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు పాల్పడాలని చూసినట్లు తెలిపాడు. అనంతరం ఆ యువకుడిని పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు.