ప్రాణం తీసిన సెల్ఫీ సరదా.. కొంగల జలపాతంలో జారిపడి యువకుడు మృతి

ప్రాణం తీసిన సెల్ఫీ సరదా..  కొంగల జలపాతంలో  జారిపడి యువకుడు మృతి

 సండే రోజు ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లిన విహార యాత్ర కాస్త విషాదాన్ని నింపింది. సెల్ఫీ కోసం ప్రయత్నించి జలపాతంలో పడి చనిపోయాడు ఓ యువకుడు .ఈ ఘటన  ములుగు జిల్లాలోని జలపాతం దగ్గర జరిగింది.

అసలేం జరిగిందంటే..  హైదరాబాద్ లో ఉండే 8 మంది స్నేహితులు కలిసి సెప్టెంబర్ 21న ములుగు జిల్లాలోలని వాజేడు మండలంలోని కొంగాలజలపాతం దగ్గరకు వెళ్లారు.  జలపాతం దగ్గరకు వెళ్లి  కాసేపు సరదాగా గడిపారు. అందులో ఒకరు  మహాన్వేష్ అనే యువకుడు వాటర్ దగ్గర సెల్పీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు జలపాతంలో జారిపడి మృతి చెందాడు. మృతుడిది హైదరాబాద్ లోని ఉప్పల్. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు యువకుడి మృతదేహాన్ని పరిశీలించారు. యువకులంతా అనుమతి లేకున్నా జలపాతం దగ్గరకు వెళ్లినట్లు చెప్పారు. 

కెండ్ టూర్  పచ్చని చెట్లు, వాగులు వంకలు, కొండలతో చూడగానే నచ్చే ప్లేస్  కొంగల వాటర్ ఫాల్. ఇక్కడ నల్లని రాళ్ల దొంతర మీద నుంచి నీళ్లు ధారగా కాకుండా జల్లుల్లా కిందకి పడుతున్న దృశ్యం భలేగా అనిపిస్తుంది. ములుగు జిల్లా, వాజేడు మండలంలోని కొంగల ఊళ్లో ఉంది ఈ జలపాతం. తెలంగాణ నయగరా'గా పేరొందిన బొగత వాటర్ ఫాల్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది కొంగల జలపాతం. ఒకప్పుడు పులులు ఇక్కడికి నీళ్లు తాగడానికి వచ్చేవట. అందుకే ఈ వాటర్ ఫాల్ని 'పులిమడుగు' అని కూడా పిలుస్తారు. కొంగల ఊరి నుంచి మూడు కిలోమీటర్ల దూరం ఉన్న వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్లాలంటే దాదాపు నలభై నిమిషాలు ట్రెక్కింగ్ చేయాలి. కాలి నడకన పంట పొలాలు, పిల్ల కాల్వలు, రాళ్లు రప్పలు దాటుకుంటూ వెళ్తుంటే అడ్వెంచర్ చేసిన ఫీలింగ్ వస్తుంది.