ప్రాణహిత నదిలో మంచిర్యాల జిల్లా యువకుడు మృతి.. కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి వివేక్ హామీ..

ప్రాణహిత నదిలో మంచిర్యాల జిల్లా యువకుడు మృతి.. కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి వివేక్ హామీ..

ప్రాణహిత నదికి స్నానానికి వెళ్లి ప్రమాద వశాత్తు మృతి చెందిన మంచిర్యాల జిల్లా యువకుడు శ్రీశైలం కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. బుధవారం (అక్టోబర్ 22) కోటపల్లి మండలం రొయ్యలపల్లీ గ్రామానికి చెందిన శ్రీశైలం మృతదేహాన్ని చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరిశీలించారు మంత్రి వివేక్. శ్రీశైలం కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇల్లుతో పాటు అన్ని విధాలా ఆదుకుంటామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. 

.శ్రీశైలం నా గెలుపు, ఎంపీ వంశీ కృష్ణ గెలుపుకు చాలా కృషి చేశారని ఈ సందర్భంగా మంత్రి వివేక్ అన్నారు. చాలా చురుకైన కాంగ్రెస్ యువ కార్యకర్త.. ఇంత చిన్న వయసులో చనిపోవడం  బాధాకరం అని అన్నారు. ప్రాణహిత నదిలో అదే చోట గతంలో కూడా చనిపోవడం జరిగిందని అన్నారు. ఇలాంటి ప్రదేశాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాట్లు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. 

ప్రజలు ఎవరైనా గోదావరి స్నానికి వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు సాక్షన్ చేస్తామని తెలిపారు.