మరి కొన్నిరోజుల్లో పెళ్లి.. చైనాలో చిక్కుకున్న కర్నూలు యువతి

మరి కొన్నిరోజుల్లో పెళ్లి.. చైనాలో చిక్కుకున్న కర్నూలు యువతి

కరోనా వైరస్ తో బెంబేలెత్తిపోతున్నా చైనాలో కర్నూలుకు చెందిన యువతి  చిక్కుకుంది. ఇవాళ ఢిల్లీకి వస్తుండగా చైనా అధికారులు ఆమెను అడ్డుకున్నారు.  వూహాన్ ప్రాంతంలో అన్నెం శృతి అనే యువతి అక్కడే ఉండిపోయింది. కర్నూలు జిల్లా కోవెల కుంట్ల మండలం  బీజనవేములకు  చెందిన  అన్నెం శృతి గతేడాది ఆగస్టులో టీసీఎల్ కంపెనీ తరపున ట్రైయినింగ్ కు వెళ్లింది. మొత్తం 60 మంది ఉద్యోగులు తిరుపతి నుంచి  చైనాకు వెళ్లారు.  ప్రస్తుతం చైనాలో కరోనా వైరస్ తీవ్రత కారణంగా అక్కడి నుంచి 60 మంది తిరుగుపయనం అయ్యారు. అయితే శృతితో పాటు మరో యువకుడికి జ్వరం 90 డిగ్రీలు  ఉండటంతో  వాళ్లను అడ్డుకున్నారు. అయితే అక్కడ తినడానికి తిండి పెట్టడం లేదని..మందులు కూడా ఇవ్వడం లేదని చెరో చోట ఉండిపోయామని ఆవేదన చెందుతున్నారు. కర్నూలులో ఉంటున్న తన బంధువులతో శృతి వీడియోలో మాట్లాడింది. తమను భారత్ వచ్చేలా చూడాలని కోరింది.

శృతికి ఈ నెల 14న మహానంది మండలం తమ్మడపల్లెకు చెందిన యువకునితో పెళ్లి ఉంది. పెళ్లి సమయం దగ్గర పడుతుండటంతో శృతి చైనాలో చిక్కుకోవడంతో తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వ వెంటనే స్పందించి తమ కుమార్తెను ఇంటికి చేర్చాలంటూ తల్లిదండ్రులు కోరుతున్నారు.

see more news

మేడారానికి హెలికాప్టర్ సర్వీస్..టికెట్ ధరెంతంటే..

రేణుకకు భవిష్యత్తు లేకుండా చేసిన రేపిస్ట్ చెన్న కేశవులు