
ములుగు, వెలుగు: ములుగు మండలం వాగునుతి గ్రామంలోని రామాలయం, హనుమాన్ టెంపుల్ కి ఏ టూ జెడ్ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబేర్ పాషా మంగళవారం రూ.50వేల విరాళం అందించారు. ఆలయంలో మౌలిక సదుపాయాల కల్పనకు, ఇతర అవసరాల దృష్ట్యా ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఆయన వెంట శ్రీశైలం యాదవ్, మధు, శ్రీనివాస్, సంజీవ, మల్లేశ్ ఉన్నారు.