ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు ఇది పూనకాలు తెప్పించే వార్త. 'పుష్ప' చిత్రంతో గ్లోబల్ రేంజ్‌లో తన సత్తా చాటిన బన్నీ, ఇప్పుడు తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీతో కలిసి పాన్ వరల్డ్ బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమయ్యారు. ఇప్పటికే 'AA22xA6' ( వర్కింగ్ టైటిల్ ) సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి అల్లు అర్జున్ పుట్టినరోజు (ఏప్రిల్ 8) సందర్భంగా అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది.
హాలీవుడ్ రేంజ్ పోస్టర్.. !
లేటెస్ట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తుంటే, అట్లీ ఈసారి ఏదో పెద్ద ప్రయోగమే చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఒక క్రూర మృగం (తోడేలును పోలి ఉన్న) పంజా, వెనుక మబ్బులు పట్టిన ఆకాశం కింద మసకబారిన ఒక పాత కోట.. వెరసి ఒక ఇంటెన్స్ అట్మాస్పియర్‌ను క్రియేట్ చేశాయి. బన్నీ ఇందులో ఒక వింత శక్తి ఉన్న వ్యక్తిగా కనిపిస్తారా? లేక హాలీవుడ్ సినిమాల తరహాలో వింత జీవులతో పోరాడే వీరుడిగా కనిపిస్తారా? అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్.
రేపు అసలు వేట మొదలు!
ఈ ప్రతిష్టాత్మక చిత్ర టైటిల్‌ను ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 11 గంటలకు అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్, అట్లీ లాస్ ఏంజిల్స్‌లోని టాప్ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోలను సందర్శించి రావడం, ఈ సినిమా 'హై ఎండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్' అని చెప్పకనే చెబుతోంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవి 2027 లో విడుదల కానుంది.
స్టార్ పవర్‌తో కూడిన కాంబినేషన్
ఈ ప్రాజెక్ట్‌ను మరింత స్పెషల్‌గా మార్చేది ఇందులోని భారీ తారాగణం. బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనే ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అంతే కాకుండా ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న విలన్ పాత్రలో కనిపిస్తారనే వార్త ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ప్రస్తుతం మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి బాణీలు అందిస్తున్నారు . లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో బన్నీ చేయబోయే ఈ సినిమాపై కూడా రేపు మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఐకాన్ స్టార్ బర్త్ డే సందర్భంగా టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
Brace for the BlAAst💥
— Sun Pictures (@sunpictures) April 7, 2026
Title Poster - Tomorrow @ 11 AM@alluarjun @Atlee_dir @deepikapadukone#AA22xA6 pic.twitter.com/pPHn70C77o
