AA22xA6 Tilte: బర్త్‌డే రోజున బ్లాస్టింగ్ అప్డేట్.. అల్లు అర్జున్- అట్లీ మూవీకి టైటిల్ ఫిక్స్

AA22xA6 Tilte: బర్త్‌డే రోజున బ్లాస్టింగ్ అప్డేట్.. అల్లు అర్జున్- అట్లీ మూవీకి టైటిల్ ఫిక్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్‌‌‌‌లో ఓ భారీ పాన్ ఇండియా చిత్రం రాబోతుంది. ఇప్పటికే ముంబైలో కొంతభాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. బుధవారం ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్‌‌‌‌డే సందర్భంగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 

బుధవారం (ఏప్రిల్ 8, 2026) అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ అదిరిపోయే అప్డేట్‌ అందించారు. ఇన్నాళ్లు AA22xA6 వర్కింగ్ టైటిల్‌తో కొనసాగిన ఈ ప్రాజెక్ట్‌కు అధికారికంగా “రాకా” (Raaka) అనే టైటిల్‌ను ప్రకటించారు. టైటిల్‌తో పాటు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుతోంది. మ‌నిషి, మృగం క‌ల‌గ‌లిపిన ఈ లుక్లో బ‌న్నీ లుక్ షాకింగ్గా ఉంది. 

పోస్టర్‌లో అడవి మృగాన్ని తలపించేలా పదునైన వేలి గోళ్లు, వేటగాడి రౌద్రాన్ని ప్రతిబింబించే విజువల్స్‌తో ప్రత్యేకంగా బన్నీని డిజైన్ చేశారు. దీంతో ఈ చిత్రం ప్రేక్షకులను పూర్తిగా కొత్త సినిమాటిక్ వరల్డ్‌లోకి తీసుకెళ్లే విధంగా రూపొందుతున్నట్లు అర్థమవుతోంది.

సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్‌‌‌‌లో కనిపించబోతున్నాడని సమాచారం. ఇక్కడ, ఆశ్చర్యం ఎంటంటే, ఈ సినిమాలో హీరో, విల‌న్ రెండూ బ‌న్నీనే. ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది విల‌న్ పాత్ర‌. హీరో లుక్ కోసం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. 

హాలీవుడ్ టెక్నీషియన్స్‌‌‌‌తో సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌‌‌‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మొత్తానికి ఈ ప్రాజెక్ట్, విజువల్ గ్రాండియర్ తో అంతర్జాతీయ స్థాయిలో ఉండబోతోందనే అంచనాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉండగా, 2026 దీపావళి లేదా క్రిస్మస్ సందర్భంగా విడుదలయ్యే అవకాశం ఉంది.