ఏషియన్ సత్యంను లాంచ్ చేసిన ఐకాన్ స్టార్

ఏషియన్ సత్యంను లాంచ్ చేసిన ఐకాన్ స్టార్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నిర్మిస్తున్న ఏఏఏ సినిమాస్(AAA Cinemas) మల్టీఫ్లెక్స్‌ జూన్ 15 గురువారం ఘనంగా ప్రారంభమైవుంది. అమీర్ పేట్ లోని సత్యం థియేటర్ ను ఆసియన్ సత్యం(Asian Sathyam)గా తిరిగి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఏషియన్ గ్రూప్స్(Asian Groups), అల్లు అర్జున్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మల్టీఫ్లెక్స్‌ నిర్మాణం ఈ మధ్యే పూర్తవడంతో జూన్ 15న పూజ కార్యక్రమాలు నిర్వహించారు. 

ఈ ఈవెంట్ కు అల్లు అరవింద్(Allu Aravind), అల్లు అర్జున్, తలసాని శ్రీనివాస్ యాదవ్(Thalasani Srinivas yadav), నారాయణ్ దాస్(Narayan Das),అనుదీప్ కేవీ(Anudeep kv),అల్లు వెంకట్(Allu Venkat) లు ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఇక టాలీవుడ్ నుండి ఇప్పటికే పలువురు హీరోలు థియేటర్స్ బిజినెస్ లో రాణిస్తున్నారు. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh babu)కు.. ఏఎంబీ సినిమాస్(AMB Cinemas), రౌడీ హీరో విజయ్ దేవరకొండకు(Vijay Devarakonda) ఏవీడీ సినిమాస్(AVD Cinemas) పేరుతో ధియేటర్లు ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ లిస్టులోకి అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు.

ALSO READ:బన్నీ థియేటర్లో ఆదిపురుష్కు భారీ రెస్పాన్స్