Sabdham Teaser: ఒక్క డైలాగ్ లేకుండా తమన్ బీజీఎంతోనే భయపెట్టిన శబ్దం టీజర్

Sabdham Teaser: ఒక్క డైలాగ్ లేకుండా తమన్ బీజీఎంతోనే భయపెట్టిన శబ్దం టీజర్

‘వైశాలి’ లాంటి సూపర్ హిట్ తర్వాత హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్‌‌ కాంబినేషన్‌‌లో ‘శబ్దం’(Sabdham) అనే సూపర్‌‌ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ వస్తోంది. 7G ఫిల్మ్స్, ఆల్ఫా ఫ్రేమ్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.

తాజాగా విక్టరీ వెంకటేశ్ చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఇందులో ఆది కొన్ని విచిత్రమైన శబ్దాలను రికార్డ్ చేస్తుండగా..చుట్టూ గబ్బిలాలు ఎగురుతుండటం ఆసక్తికరంగా ఉంది.టీజర్ స్టార్టింగ్ లోనే ఓ కాలేజీ బిల్డింగ్పై నుంచి ఓ యువతి కిందికి దూకి సూసైడ్ చేసుకోవడం..ఆ తర్వాత అదే కాలేజీలోకి లెక్చరర్గా హీరో ఎంట్రీ ఇవ్వడం..ఇక అదే టైంలో ఆ బిల్డింగ్లో జరిగిన భయంకరమైన ఘటనలతో టీజర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది.ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా తమన్ ఇచ్చిన 
బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంటెన్స్ కలిగిస్తోంది.

ఇందులో సిమ్రన్ ఓ మ్యూజిక్ టీచర్గా చేసినట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది.ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా వెలిగిన సిమ్రాన్..సెకెండ్ ఇన్నింగ్స్‌‌‌‌ లో పలు కీలక పాత్రలు పోషిస్తోంది. ఇపుడు ఈ సినిమాతో కంబ్యాక్ అదిరిపోవడం కన్ఫమ్ అనే తెలుస్తోంది. 

తమన్ చాలా కాలం నుంచి మాస్, క్లాస్ సినిమాలు చేస్తూ రొటీన్ అనే మచ్చ ఈ సినిమాతో పోవడం ఖాయం అనిపిస్తోంది. అంతేకాదు తమన్ ఇచ్చిన స్పెషల్ సౌండ్ ఎఫెక్ట్స్, ఆర్ఆర్ విదేశాలలో వెళ్లి చేసాడట. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్, ఎం.ఎస్. భాస్కర్, రాజీవ్ మీనన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

ఈ మూవీని తమిళంలో రూపొందించినప్పటికీ తెలుగులోనూ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.శబ్దం రిలీజ్ డేట్ ను మేకర్స్ త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశం ఉంది.