Shambhala Premieres: ఇవాళే (Dec24) మిస్టికల్ థ్రిల్లర్ ‘శంబాల’ ప్రీమియర్స్.. హైదరాబాద్ థియేటర్ల లిస్ట్, టైమింగ్స్ ఇవే!

Shambhala Premieres: ఇవాళే (Dec24) మిస్టికల్ థ్రిల్లర్ ‘శంబాల’ ప్రీమియర్స్.. హైదరాబాద్ థియేటర్ల లిస్ట్, టైమింగ్స్ ఇవే!

హీరో ఆది సాయి కుమార్ నటించిన అప్ కమింగ్ రిలీజ్ మూవీ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’. యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్‌‌ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి నిర్మించారు. క్రిస్మస్‌ కానుకగా రేపు (డిసెంబరు 25న) ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఒకరోజు ముందుగానే.. ఇవాళ బుధవారం (డిసెంబర్ 24న) ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు మేకర్స్.

ఇప్పటికే, శంబాల నైజాం ఏరియా ప్రీమియర్ & రెగ్యులర్ షోల బుకింగ్స్ సైతం ఓపెన్ అయ్యాయి. అయితే, హైదరాబాద్ లోని సెలెక్టెడ్ థియేటర్లలో స్పెషల్ ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. బుక్ మై షో, పేటిఎం వంటి ప్లాట్ఫామ్స్లో టికెట్స్ అందుబాటులోకి వచ్చాయి. 'శంబాల' లాంటి చిత్రాలను థియేటర్లో చూస్తేనే ఆ ఫీల్ దక్కుతుందని ఆడియెన్స్ ఫిక్స్ అయిపోయారు. ఈ క్రమంలో హాట్ కేకుల్లా బుకింగ్స్ చేస్తున్నారు. ఇదిలానే కొనసాగితే.. శంబాల రూపంలో ఆదికి సాలిడ్ హిట్ పడే అవకాశం ఉంది. 

సెలెక్టెడ్ థియేటర్ల ప్రీమియర్స్ టైమింగ్స్:

AMB సినిమాస్ లో రాత్రి 7:40 గంటలకు,
AAA సినిమాస్ లో రాత్రి 7:00 గంటలకు షోలు పడనున్నాయి. 
RTC క్రాస్ రోడ్స్ లోని సంధ్య 70MM లో సాయంత్రం 6:45 గంటలకు,
మైత్రి విమల్ థియేటర్ లో సాయంత్రం 7:17 గంటలకు,
దిల్ సుఖ్ నగర్ లోని మైత్రి మేఘాలో రాత్రి 9:45 గంటలకు షోలు ఉండబోతున్నాయి. 

అయితే, ప్రీమియర్స్ ద్వారా వచ్చే టాక్ సినిమాకు ప్లస్ అవ్వనుంది. రివ్యూలు, రేటింగ్స్, ప్రీమియర్స్ ద్వారా వచ్చే డబ్బులు అటూ ఆది సాయి కుమార్ కు, సినిమా నిర్మాతలకు కలిసొచ్చే ప్రధాన అంశం. ఇప్పటికే, ఆది 10 సినిమాలకు పైగా వరుస ఫైయిల్యూర్స్లో ఉన్నారు. అందువల్ల ఈ శంభలా మూవీ ఆది కెరియర్కు మరో జన్మలా మారనుంది. టీజర్, ట్రైలర్ విజువల్స్ తోనే సినీ ప్రేక్షకులు మాట్లాడుకునేలా చేసింది శంభలా. 

ALSO READ : ఈసారి హిట్ కొట్టబోతున్నామనే కాన్ఫిడెన్స్‌‌ తో ఉన్నా

‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’ కథ:

సూపర్ నేచురల్ థ్రిల్లర్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో శంబాల తెరకెక్కింది. ఇందులో జియో సైంటిస్ట్‌‌గా (భౌగోళిక శాస్త్రవేత్తగా) ఆది కనిపించాడు.ఈ కథనం 1980ల నాటి వాతావరణంలో, ఒక మారుమూల గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఆ ఊరిలో జరుగుతున్న అంతుచిక్కని హత్యలు, అతీంద్రియ సంఘటనలను పరిశోధించడానికి జియో-సైంటిస్ట్ విక్రమ్‌గా ఆది సాయికుమార్ రంగంలోకి దిగుతాడు.

దేవుళ్లు, అద్భుతాలు అంటూ దేనినీ నమ్మని హేతువాది అయిన విక్రమ్‌కు, ఈ మిస్టికల్ శక్తిని ఛేదించడం ఒక పెను సవాల్ మారుతుంది.. లాజిక్‌కు, మర్మమైన శక్తులకు మధ్య జరిగే ఈ భీకర పోరాటమే సినిమా కథాంశం. దర్శకుడు యుగంధర్‌ ముని ఈ చిత్రాన్ని గతంలో ఎప్పుడూ భారతీయ తెరపై చూపించని పాయింట్‌తో, అద్భుతమైన విజువల్స్‌తో తీర్చిదిద్దారు.