ఈ బ్యూటీ OTT కంటెంట్‌కి పిచ్చా ఫ్యాన్స్.. ఇపుడు మరో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్తో.. స్ట్రీమింగ్ వివరాలివే

ఈ బ్యూటీ OTT కంటెంట్‌కి పిచ్చా ఫ్యాన్స్.. ఇపుడు మరో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్తో.. స్ట్రీమింగ్ వివరాలివే

బాలీవుడ్​ బ్యూటీ ఆదితి పొహంకర్ (Aaditi Pohankar) పరిచయం అక్కర్లేని పేరుగా దూసుకెళ్తోంది. వరుస సినిమాలు, సిరీస్లు చేస్తూ మోస్ట్ బిజీయెస్ట్ నటిగా మారిపోయింది. ‘షి’, ‘లాయి బారి’, ‘ట్రక్​భర్ స్వప్న’, ‘స్టార్’, ‘ఏక్ బద్నామ్ ఆశ్రమ్’ ‘మండల మర్డర్స్’ వంటి ఓటీటీ కంటెంట్‌తో తెగ పాపులారిటీ సొంతం చేసుకుంది బ్యూటీ అదితి. ఈ క్రమంలోనే అదితి నటించిన లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్​ ‘జిద్దీ ఇష్క్’ (Ziddi Ishq). జిద్దీ అంటే హిందీలో మొండి అని అర్థం. 

ప్రస్తుతం ఈ సిరీస్ జియో హాట్‌‌‌‌స్టార్​ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. బెంగాల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ తెలుగులో కూడా అందుబాటులో ఉంది.  7 ఎపిసోడ్స్తో రూపొందిన ఈ సిరీస్.. మోస్ట్ ట్రెండింగ్లో ఒకటిగా నిలిచింది. డైరెక్టర్ రాజ్ చక్రవర్తి ఆసక్తికరమైన కథాకథనాలతో ఆడియన్స్ థ్రిల్ అయ్యేలా చేశాడు.

సాధారణ మధ్య తరగతి ఫ్యామిలీకి చెందిన ఓ అమ్మాయి, ఒక మంచి మనిషిని ఇష్టపడి ప్రేమిస్తుంది.ఈ క్రమంలోనే అతను అనూహ్యంగా సూసైడ్ చేసుకుని చనిపోతాడు. అందుకు కారకులు ఎవరనేది తెలుసుకుని ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఆ అమ్మాయి చేసే పోరాటంగా ‘జిద్దీ ఇష్క్’ తెరకెక్కింది. మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకూ ఎక్కడా పట్టు సడలకుండా, ఆసక్తికరంగా సాగుతుంది.

యాక్షన్.. ఎమోషన్.. సస్పెన్స్ అంశాలకు ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా చూపించడంలో డైరెక్టర్ రాజ్ సక్సెస్ అయ్యాడు. ఈ సిరీస్లో అదితి పోహంకర్తో పాటుగా పరంబ్రత చటోపాధ్యాయ, బర్ఖా బిష్త్, రియా సేన్, ప్రియాన్షు, సుమీత్ వ్యాస్ కీలక పత్రాలు పోషించారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by JioHotstar (@jiohotstar)

కథేంటంటే:

మెహుల్ (ఆదితి పోహంకర్) టీనేజీ స్టూడెంట్‌‌‌‌. ఆమెకు ప్రైవేట్ ట్యూషన్ చెప్పే టీచర్‌‌‌‌‌‌‌‌ శేఖర్ (పరంబ్రత చటోపాధ్యాయ)ని అభిమానిస్తుంది. అదే తర్వాత ప్రేమగా మారుతుంది. శేఖర్‌‌‌‌‌‌‌‌ ఆమెకు గురువు మాత్రమే కాదు, ఆమె కలల్లోని హీరో కూడా. కానీ.. శేఖర్ తన ఫ్రెండ్‌‌‌‌ సయంతిక (రియాసేన్)ను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఎదుర్కొంటాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంటాడు. పోలీసులతోపాటు తన ఫ్యామిలీ కూడా అతనిది సూసైడ్ అనే నమ్ముతారు.

మెహుల్ మాత్రం అది ఆత్మహత్య కాదని భావిస్తుంది. చదువు పూర్తైన తర్వాత తన ఫ్రెండ్‌‌‌‌ ఆనంద్ (ప్రియాన్షు)తో కలిసి శేఖర్ గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెడుతుంది. కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ మౌషుమి (బర్ఖా బిష్ట్), వ్యాపారవేత్త సిద్ధార్థ్ (సుమీత్ వ్యాస్)లను అనుమానిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకీ శేఖర్‌‌‌‌‌‌‌‌ది హత్యా? ఆత్మహత్యా? తెలుసుకోవాలంటే సిరీస్‌‌‌‌ చూడాలి.