Cricket World Cup 2023: మొదట బ్యాటింగ్ చేస్తే ఆస్ట్రేలియా, ఇండియా ఎంత కొడతారు? ప్రముఖ కామెంటేటర్ జోస్యం

Cricket World Cup 2023: మొదట బ్యాటింగ్ చేస్తే ఆస్ట్రేలియా, ఇండియా ఎంత కొడతారు? ప్రముఖ కామెంటేటర్ జోస్యం

అహ్మదాబాద్ వేదికగా కాసేపట్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ జరగనుంది. నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో ఇప్పటికే చాలా మంది జోస్యం చెప్పేసారు. తాజాగా ప్రముఖ కామెంటేటర్, మాజీ భారత ప్లేయర్ ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో చెప్పడమే కాకుండా మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ఎన్ని పరుగులు చేస్తాయో కూడా చెప్పుకొచ్చాడు. 

ఆస్ట్రేలియా భవితవ్యం అంతా వ్యక్తిగత ప్రదర్శనపై ఆధారపడి ఉంటుందని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఆసీస్ విజయం సాధించాలంటే డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్‌లలో ఒకరు సంచలన ఇన్నింగ్స్ లు ఆడాల్సి ఉంటుందని.. భారత జట్టులో మాత్రం అందరూ మ్యాచ్ విన్నర్లే ఉన్నారని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ లో భారత్ విజయం ఏకపక్షంగా సాగుతుందని ధీమా వ్యక్తం చేసాడు. 

మొదట భారత్ బ్యాటింగ్ చేసి 300 పరుగుల కొడితే ఆస్ట్రేలియాపై 50కి పైగా పరుగుల తేడాతో విజయం సాధిస్తుందని.. ఒక వేళ మొదటి ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తే భారత బౌలర్లు కంగారూల జట్టును 240 పరుగులకు చిత్తు చేస్తుందని.. భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధిస్తుందని ఆకాశ్ చోప్రా జోస్యం చెప్పాడు.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricTracker (@crictracker)