
టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా తన ఆల్ టైం భారత టెస్ట్ ప్లేయింగ్ 11 జట్టును ప్రకటించాడు. ఈ జట్టుకు విరాట్ కోహ్లీని కెప్టెన్ గా ఎంపిక చేశాడు. ఆకాష్ జట్టులో 5 గురు బ్యాటర్లు.. ఒక వికెట్ కీపర్.. ఒక ఆల్ రౌండర్.. ఇద్దరు స్పిన్నర్లు.. ఇద్దరు ఫాస్ట్ బౌలర్లకు చోటు కల్పించాడు. వివారాల్లోకెళ్తే.. డాషింగ్ బ్యాటర్ సెహ్వాగ్, దిగ్గజ బ్యాటర్ గవాస్కర్ లను ఓపెనర్లుగా ఎంచుకున్నాడు. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్, క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ లను వరుసగా మూడు, నాలుగు స్థానాలకు ఎంపిక చేశారు.
విరాట్ కోహ్లీకి సామర్ధ్య బాధ్యతలతో పాటు ఐదో స్థానంలో చోటు కల్పించాడు. వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ కు తన జట్టులో స్థానం ఇచ్చాడు. దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ ను ఏకైక ఆల్ రౌండర్ గా ఎంపిక చేశాడు. లెజెండరీ స్పిన్నర్లు అనీల్ కుంబ్లే, అశ్విన్ లను ఛాన్స్ ఇచ్చాడు. స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లుగా బుమ్రా, జహీర్ ఖాన్ లను సెలక్ట్ చేశాడు. ఆకాష్ చోప్రా తన జట్టులో లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ, హర్భజన్ సింగ్, జడేజా లాంటి స్టార్ క్రికెటర్లకు చోటు ఇవ్వలేదు.
ఆకాష్ చోప్రా ఆల్ టైమ్ ఇండియన్ టెస్ట్ XI
వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కపిల్ దేవ్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్
Here is a look at Aakash Chopra's all time test XI for team India.
— SportsTiger (@The_SportsTiger) July 15, 2025
📸: BCCI #indveng #engvindtest pic.twitter.com/MdzBkr6q9E