అక్షరాలా లక్ష రూపాయలు.! కోహ్లీ, ధోనీ కటింగ్ ఛార్జీలు

అక్షరాలా లక్ష రూపాయలు.! కోహ్లీ, ధోనీ కటింగ్ ఛార్జీలు

భారత క్రికెటర్లు ఎంఎస్​ ధోనీ, విరాట్​ కోహ్లీ ఏది చేసిన ప్రత్యేకతమే. ఇది మీకూ బాగా తెలుసు. వారి సంపాదన ఇంతట, వారికున్న ఆస్తులు ఇవట అంటూ కథనాలూ వస్తుంటాయి. ఇక వారిలో అభిమానులను బాగా ఆసక్తి రేకెత్తించేది.. హెయిర్ స్టయిల్. వీరిద్దరూ ఎప్పటికప్పుడు సరికొత్త లుక్‌లో కనిపిస్తూ  అభిమానులను ఎంటర్టైన్ చేయడం సదా మామూలే. అందునా, ముఖ్యంగా మహేంద్రుడు 40 ఏళ్ల వయసులోనూ కుర్రకారులా హెయిర్ స్టయిల్ మెయింటైన్ చేస్తుంటాడు. మరి, అందుకు వీరు ఎంత చెల్లిస్తారు..? అనేది ఎప్పటినుంచో సస్పెన్స్. ఆ వివరాలను మొదటిసారి బహిర్గత పరిచాడు.. వారి హెయిర్ స్టయిలిస్ట్ ఆలిమ్​ హకిమ్.

 అక్షరాలా లక్ష రూపాయలు!

దేశంలో ఉన్న ప్రముఖ హెయిర్​ స్టైలిస్ట్స్‌లో ఒకరే.. ఆలిమ్​ హకిమ్​. ఇతని దగ్గరకు విరాట్​ కోహ్లీ, ఎంఎస్​ ధోనీ, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్ వంటి క్రికెటర్లే కాదు.. సినీ సెలబ్రటీలు, బడా బడా వ్యాపారవేత్తల పిల్లలూ వస్తుంటారు. అయితే, కోహ్లీ,​ ధోనీల హెయిర్ స్టయిల్ మార్చే సమయంలో తాను ఎంత ఛార్జ్​ చేస్తారో చెప్పారు హకిమ్. కనీసం ఒక సెషన్​కి రూ. 1లక్ష ఛార్జ్​ చేస్తానని వెల్లడించారు.

"హెయిర్​ కట్‌కి నేను ఎంత ఛార్జ్​ చేస్తానో అందరికి తెలిసిన విషయమే. మినిమమ్​ ఒక సెషన్​కి లక్ష రూపాయలు వసూలు చేస్తాను. ఇక ఐపీఎల్​ సమయం కాబట్టి.. ఈసారి కొత్తగా ఏదైనా చెయ్యాలని అనుకున్నా.. అందుకు తగ్గట్టే​ కోహ్లీ కొత్త ఎక్స్​పరిమెంట్స్ కోసం రిఫరెన్స్​ ఇస్తుంటాడు.." అని ఆలిమ్​ హకిమ్​ ఓ మీడియా సంస్థకు తెలిపారు.

"ఇక మహీ(ధోని) గురించి చెప్పాలంటే.. ఆయన నేను చాలా డిఫరెంట్​. స్టార్​ అయినప్పటికీ కూల్‌గా ఉండే పర్సనాలిటీ. ఆయనకు హెయిర్​ కట్​ చేసే సమయంలో స్టాఫ్ కు రికార్డు చేయాలని నేనే చెప్తుంటాను. వాటిని పోస్ట్​ చేస్తాను.." అని ఆలిమ్​ హకిమ్ తెలిపారు. 

రూ.30 నుంచి రూ.40వేలు 

ఈ విషయం తెలిసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఒక నెటిజెన్ ఈ విషయాన్ని బాగా చమత్కరించాడు. "మరీ, లక్ష రూపాయలు ఏంటి..? బాసూ..! పోయిన జట్టు మొలిపించడానికే రూ.30 నుంచి రూ.40వేలతో సరిపెట్టుకుంటున్నారు. మీరు లక్ష అంటున్నారు. ఆ డబ్బుకు న్యాయం చేయాలంటే.. కనీసం రెండేళ్ళైనా కటింగ్ చేపించుకోకుండా ఉండాలి.." అని కామెంట్ చేశారు. మరొక నెటిజెన్, ఆలిమ్​ హకిమ్ దగ్గర ఉద్యోగాలు గట్రా..! ఏమైనా ఉంటే ఆఫర్ చేయాలనీ కోరారు.