
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకోబోతున్నాడా? అంటే అవుననే అంటోంది బాలీవుడ్ మీడియా. దంగల్ సినిమాలో అమీర్‌కు కూతురిగా నటించిన ఫాతిమా సనాషేక్‌తో కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ ఇద్దరు కలిసి పలుమార్లు మీడియా కంట కూడా పడ్డారు. దీంతో ఈ రూమర్స్ కు మరింత బలం చేకూరింది.
ఇటీవల జరిగిన అమీర్ కూతురు ఇరా ఖాన్ ఎంగేజ్‌మెంట్ వేడుకలో కూడా ఫాతిమా సందడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరూ కలిసి ఉన్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వీరిద్దరూ పికిల్ బాల్ ఆడుతూ కనిపించారు. దీంతో మరోసారి అమీర్ ఖాన్ మూడో పెళ్లి వార్తలు హాట్‌టాపిక్‌గా మారాయి.
ఇక 1986లో రీనా దత్తను పెళ్లి చేసుకున్న అమీర్ 2002లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత 2005లో కిరణ్ రావును పెళ్లి చేసుకోగా ఆమెకు 2021లో విడాకులు ఇచ్చాడు. ప్రస్తుతం ఆమీర్, ఫాతిమాతో కలిసి ఉంటున్నట్టు సమాచారం.