‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమాపై అమీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమాపై అమీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రముఖ బాలీవుడ్ నటుడు, హీరో అమీర్ ఖాన్... కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ మూవీ ఫ్యాన్ ఈవెంట్ కార్యక్రమానికి అమీర్ కూడా పాల్గొన్నారు.  ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‏లో భాగంగా ఢిల్లీలో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‏లో ఆమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా పాల్గోన్నాడు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ... కాశ్మీర్ ఫైల్స్ సినిమా తప్పకుండా చూస్తానన్నాడు.

మీరు చూశారా అని మీడియా అడగడంతో... పని బిజీలో ఉండడం వలన తానింకా ఆ సినిమా చూడలేదని చెప్పారు అమీర్ ఖాన్. కానీ తప్పకుండా చూస్తానన్నారు. ది కశ్మీర్ ఫైల్స్ మన చరిత్రకు నిదర్శనమన్నారు. ఒకానొక సమయంలో కశ్మీర్ పండితులపై జరిగిన తిరుగుబాటు.. చాలా బాధాకరమన్నారు. ఇలాంటి చిత్రాలను ప్రతి భారతీయుడు చూడాలన్నారు అమీర్. మానవత్వాన్ని నమ్మే ప్రతి ఒక్కరినీ ఈ సినిమా భావోద్వేగానికి గురి చేసిందన్నారు. ఈ మూవీ మంచి సక్సెస్ అయినందుకు ఎంతో ఆనందిస్తున్నానని తెలిపారు. 

ఈ మూవీ ఏకంగా వంద కోట్ల వసూళ్లు సాధించిది. విడుదలైన మొదటి రోజునే సెన్సెషన్ క్రియేట్ చేసింది. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన ఈ సినిమా కశ్మీర్ పండితుల జీవితంపై.. వారు ఎదుర్కొన్న పరిస్థితులపై తెరకెక్కించిన సంగతి తెలిసిందే.అనుపమ్ కేర్,మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి, దర్శన్ కుమార్, పునీత్ ఇసార్,మృణాల్ కుల్ కర్ణి ఈ మూవీలో కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు.

ఇవి కూడా చదవండి:

ఎంత ప్రేమో... తలపైనే గూడు కట్టాడు

ది కాశ్మీర్ ఫైల్స్ మూవీపై సీఎం కేసీఆర్ ఆగ్రహం