జిమ్ డ్రస్సులో.. అమీర్ ఖాన్ అల్లుడు పెళ్లి

జిమ్ డ్రస్సులో.. అమీర్ ఖాన్ అల్లుడు పెళ్లి

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌(Aamir khan) కూతురు ఇరా ఖాన్‌( Ira khan) పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాను ప్రేమించిన నుపుర్‌ శిఖరే(Nupur Shikhare)ను వివాహం చేసుకుంది. వీరి వివాహం జనవరి 3 బుధవారం ముంబైలోని స్టార్ హోటల్‌లో జరిగింది. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది మధ్య రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు ఈ జంట.

అయితే ఈ వివాహానికి వరుడు నుపుర్‌ శిఖరే జిమ్ సూట్ వేసుకొని రావడం చర్చనియ్యాంగా మారింది. అతను ఒక ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ కావడంతో.. పెళ్లి జరిగే చోటుకు జాగింగ్‌ డ్రెస్ లోనే వచ్చాడు. ఆ టీషర్ట్‌పైనే పెళ్లి కూడా కానిచ్చేశాడు. అనంతరం జరిగిన రిసెప్షన్‌కు మాత్రం కొత్త బట్టల్లో వేసుకున్నాడు. దీంతో ఈ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. నెటిజన్స్ పలురకాలుగా రియాక్ట్ అవుతున్నారు. 

కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.. జిమ్ ట్రైనర్ పెళ్లి అంటే మాములుగా ఉండదు అని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరేమో.. పెళ్లి  కొడుకే సింపుల్ గా వచ్చాడు.. పక్కన వాళ్లు బట్టల కోసం అంత ఖర్చు చేయడం అవసరమా అని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఇరా ఖాన్-నుపుర్‌ శిఖరే పెళ్లి వీడియో నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది.