ఉత్తరాఖండ్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన ఆప్

V6 Velugu Posted on Sep 15, 2021

ఉత్తరాఖండ్ ఎన్నికలను ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తోంది. ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ థామీపై ఆప్ అభ్యర్థిగా SS కలెర్ పోటీ చేయనున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఖతిమా నియోజకవర్గం నుంచి థామీపై కలెర్‌ను పోటీలోకి దించాలని పార్టీ నిర్ణయించింది. ఎన్నికల బరిలోకి దిగేందుకు ఆప్ రాష్ట్ర అధ్యక్షుడి పదవికి కలెర్ రాజీనామ చేశారు. కలెర్ రాజీనామాతో ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లను పార్టీ నియమించినట్టు ఆప్ సీనియర్ నేత కల్నల్ అజయ్ కొథియాల్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల పేర్లను త్వరలోనే పార్టీ ప్రకటిస్తుందని చెప్పారు. 2022 ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.

Tagged uttarakhand, AAP announces , CM candidate, SS Kaler 

Latest Videos

Subscribe Now

More News