ఢిల్లీ మంత్రి అతిషికి ఈసీ నోటీసులు

ఢిల్లీ మంత్రి అతిషికి ఈసీ నోటీసులు

ఢిల్లీ మంత్రి ఆతిశీకి ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. బీజేపీపై చేసిన ఆరోపణలకు ఏప్రిల్  6న మ.12 గంటలలోపు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. 

బీజేపీలో చేరాలంటూ ఆ పార్టీ నేతలు తమను సంప్రదించారని, పార్టీలో చేరకపోతే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని బెదిరించినట్లు అతిషి ఇటీలవ ఆరోపించారు. బీజేపీలో చేరాలని సన్నిహితుల ద్వారా బీజేపీ తనను సంప్రదించిందన్నారు. బీజేపీలో చేరకపోతే  మరో  నెలలో తనను  ఈడీ అరెస్టు చేస్తుందని చెప్పారు.

సీఎం కేజ్రీవాల్ జైలులో ఉన్నప్పటికీ.. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికీ యూనిటీగా, బలంగా ఉందన్నారు. అయితే బీజేపీ నేతలు ఆమ్ ఆద్మీ పార్టీ   తదుపరి నాయకత్వాన్ని జైలులో పెట్టాలని యోచిస్తున్నారని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల లోపు   మరో 4 మంది AAP నాయకులు.. సౌరభ్ భరద్వాజ్, అతిషి, దుర్గేష్ పాఠక్,  రాఘవ్ చద్దాలను ఈడీ అరెస్ట్ చేస్తుందని ఆరోపించారు. దీంతో వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ  ఈసీ అతిషికి నోటీసులు పంపింది. 

Also Read :కస్టడీలో ఉన్న రాధా కిషన్ రావుకు హైబీపీ