కస్టడీలో ఉన్న రాధా కిషన్ రావుకు హైబీపీ

కస్టడీలో ఉన్న రాధా కిషన్ రావుకు హైబీపీ

ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా రెండో రోజు (ఏప్రిల్ 5) కస్టడీలో ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావు ఆనారోగ్యానికి గురైయ్యారు. విచారణ సమయంలో రాధా కిషన్ రావుకు హైబీపీ వచ్చింది. దీంతో ఈ సమాచారాన్ని దర్యాప్తు బృందం వైద్యులకు తెలిపారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లోనే రాధా కిషన్ రావుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావును తన కస్టటడీకి కోరుతూ.. పోలీసులు వేసిన పిటిషన్ పై  బుధవార నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు ఆయనకు 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును తెలిపారు. అయితే, ఏడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతినిస్తూ.. నాంపల్లి కోర్టు ఉత్తర్వులు వెలువరించింది. ఏప్రిల్ 4 నుంచి 10వ తేదీ వరకు రాధాకిషన్ రావు పోలీసుల కస్టడీలోనే ఉండనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధా కిషన్ రావు A4 గా ఉన్నారు.

Also Read :ఢిల్లీ మంత్రి అతిషికి ఈసీ నోటీసులు