బెంగాల్‌పై కన్నేసిన కేజ్రీవాల్

బెంగాల్‌పై కన్నేసిన కేజ్రీవాల్

ఆమ్ ఆద్మీ పార్టీ... ఇప్పుడు దేశ వ్యాప్తంగా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పంజాబ్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి తన సత్తా చాటింది. దీంతో ఇప్పుడు అంతా ఆప్ పైనే చర్చించుకుంటున్నారు. అయితే తాజాగా ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తన నెక్స్ట్ టార్గెట్ పశ్చిమ బెంగాల్ అంటూ కీలక ప్రకటన చేశారు. పంజాబ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వచ్చే ఏడాది జరగనున్న పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలపై కన్నేసింది.

పశ్చిమ బెంగాల్‌లో 2023 పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆప్ సోమవారం ప్రకటించింది. దాని కోసం ఇప్పటికే ప్రచారం ప్రారంభించింది. పశ్చిమ బెంగాల్‌లో 2023 పంచాయతీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుంది. పార్టీ హైకమాండ్ సూచనల మేరకు స్థానిక యూనిట్ ఇప్పటికే తన ప్రచారాన్ని ప్రారంభించింది. మార్చి 13న కోల్‌కతాలో ఆప్ ర్యాలీ నిర్వహించింది" అని బెంగాల్ ఆప్ ఇంచార్జ్ సంజోయ్ బసు తెలిపారు. 

ఇదిలా ఉండగా, ఆప్ బెంగాల్ రాజకీయాల్లోకి రావడంపై బీజేపీ నాయకుడు సమిక్ భట్టాచార్య స్పందించారు. “ఆప్ బెంగాల్‌కు వచ్చినప్పుడు మేము చూశాము, ఆ సమయంలో, వారు కార్యకర్తలను కూడగట్టలేక వారు వెళ్లిపోయారు. ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజలకు హక్కు ఉంది. వారు కోరుకున్న చోట నుండి ఎన్నికల్లో పోటీ చేయోచ్చు. కానీ బెంగాల్‌లో ఆ అవసరం లేదు.గోవాలో మమతా బెనర్జీకి ఏమైంది? ఆమె పోటీదారులంతా స్వతంత్ర అభ్యర్థులు. బెంగాల్‌లో కూడా ఆప్‌కి అదే జరుగుతుంది." అన్నారు భట్టాచార్య. మరోవైపు మార్చి 13 న, ఆమ్ ఆద్మీ పార్టీ, మహిళా విభాగం కోల్‌కతాలో రాష్ట్ర సమావేశాన్ని నిర్వహించాయి. ఆప్ మహిళా శక్తి  రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసి రానున్న ఆరు నెలల్లో మహిళా విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు. 

ఇవి కూడా చదవండి:

కాంగ్రెస్ ఓటమికి వారే బాధ్యత వహించాలి

హిజాబ్ వివాదంపై రేపు హైకోర్టు తీర్పు