హిజాబ్ వివాదంపై రేపు హైకోర్టు తీర్పు

హిజాబ్ వివాదంపై రేపు హైకోర్టు తీర్పు

హిజాబ్ వివాదంపై కర్నాటక హైకోర్టు రేపు తీర్పు వెలువరించనుంది. మంగళవారం ఉదయం  10:30 గంటలకు తీర్పు వెలువరించనుంది. హిజాబ్ కేసులో 11 రోజుల వరుస విచారణల అనంతరం ఫిబ్రవరి 25న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. హిజాబ్ కేసులో తమ వాదనలను ఫిబ్రవరి 25లోగా ముగించాలని కర్ణాటక హైకోర్టు కోరింది. ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌లో భాగమైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రీతూ రాజ్ అవస్తీ కూడా తమ వాదనలు లిఖితపూర్వకంగా ఇవ్వాలని పార్టీలను కోరారు. రెండు మూడు రోజుల్లో సమర్పించాలన్నారు.

కర్ణాటకలోని కోస్టల్ టౌన్ ఉడిపిలోని ప్రభుత్వ ప్రీ-యూనివర్శిటీ కళాశాల యాజమాన్యం హిజాబ్ ధరించినందుకు ఆరుగురు ముస్లిం బాలికలను తరగతులకు హాజరుకాకుండా నిషేధించింది.దీంతో ఈ ఏడాది జనవరి 1న కర్ణాటకలో హిజాబ్ వివాదం ప్రారంభమైంది.క్లాస్ రూమ్స్‌లో హిజాబ్ ధరించడానికి అనుమతి ఇవ్వలేదు. అప్పటి వరకు విద్యార్థులు తమ హెడ్ కవర్ చేస్తూ హిజాబ్ ధరించి క్యాంపస్‌కు వెళ్లేవారు. అయితే హిజాబ్ తొలగించి తరగతి గదిలోకి ప్రవేశించారని కళాశాల ప్రిన్సిపాల్ రుద్రేగౌడ తెలిపారు. అయితే  ఈ ఇనిస్టిట్యూ్‌‌లో గత 35 ఏళ్లలో హిజాబ్ రూల్ ఏం లేదు. కానీ ఇప్పుడు మాత్రం కొందరు విద్యార్థులు హిజాబ్ ధరించి వచ్చి క్లాస్ రూంలోకి అనుమతి ఇవ్వాలని కోరుతూ వస్తున్నారన్నారు ప్రిన్సిపాల్. అయితే వారికి బయటనుంచి మద్దతు ఉందని ఆయన అన్నారు. 

మరోవైపు కర్నాటకలో హిజాబ్ ధరించిన ముస్లిం బాలికలకు పోటీగా హిందూ విద్యార్థులు కాషాయ కండువాలు, కుంకుమ జెండాలు ఊపుతూ కాలేజీలు, స్కూల్స్ క్యాంపస్ వద్ద హల్ చల్ చేశారు. విద్యాసంస్థల్లో హిజాబ్‌ను అనుమతించినట్లయితే వారి మతపరమైన దుస్తులు, చిహ్నాలను ప్రదర్శించడానికి కూడా అనుమతించాలని వారు డిమాండ్ చేశారు.