చేవెళ్ల బస్సు ప్రమాదం జరిగి ఒక రోజు గడవక ముందే మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. కావలి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. బస్సుకు ముందు వెళ్తున్న ట్రాక్టర్ ట్రాక్టర్ పల్టీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. మంగళవారం (నవంబర్ 04) తెల్లవారు జామున నార్కెట్ పల్లి - అద్దంకి హైవేపై జరిగిన ఈ ప్రమాదం మరోసారి భయాందోళనలకు గురిచేసింది.
నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం బుగ్గుబావిగూడెం వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కావలి నుంచి హైదరాబాద్ వెళ్తున్నచెర్రీ ట్రావెల్స్ బస్సు నార్కెట్ పల్లి -అద్దంకి హైవే పై ట్రాక్టర్ ను డికొట్టింది. బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో రోడ్డుపై ట్రాక్టర్ పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదు మందికి గాయాలయ్యాయి.
ప్రమాదంలో గాయపడిన వారిని మిర్యాలగూడ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు.
